Skip to main content

Ugc Mandatory To Apppoint Ombudspersons- అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో అంబుడ్స్‌పర్సన్‌ తప్పనిసరి..

Ugc Mandatory To Apppoint Ombudspersons    Ombudsman resolving student issues

అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించడానికి అంబుడ్స్‌పర్సన్‌లను నియమించడం తప్పనిసరి చేస్తూ యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. కింది వాటిలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా విద్యార్థులు నేరుగా అంబుడ్స్‌పర్సన్‌ని సంప్రదించొచ్చు.

యూజీసీ మార్గదర్శకాలివే..
యూజీసీ మార్గదర్శకాల ప్రకారం.. అడ్మీషన్లలో అక్రమాలు జరిగినా, దానికి సంబంధించి సరైన వివరణ ఇవ్వకపోయినా, తప్పుడు సమాచారాన్ని ప్రచురించినా, డాక్యమెంట్స్‌ తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసినా, అడ్మీషన్లలో రిజర్వేషన్‌ను ఉల్లంఘించినా లేదా ప్రతిపాదించిన దానికంటే అధికంగా డబ్బులు డిమాండ్‌ చేసినా..

 

 

సరైన విద్యాబోధన అందించకపోయినా,విద్యార్థుల స్కాలర్‌షిప్‌ ప్రక్రియలో జాప్యం చేసినా, పరీక్షలు, ఫలితాలు ప్రకటించడంలో ఆలస్యం జరిగినా, మూల్యంకనంలో పారదర్శకత లేకపోయినా, కంప్లైంట్స్‌ ఇచ్చినా పట్టించుకోకపోయినా, లేదా వివక్ష చూపించినా..

వేధింపులకు గురిచేసినా, యూజీసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు చేపట్టినా.. వీటిలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా అంబుడ్స్‌పర్సన్‌ని సంప్రదించమని యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌(యూజీసీ)పేర్కొంది. ఈ మేరకు గైడ్‌లైన్స్‌ని ఎక్స్‌లో పంచుకుంది. విద్యాసంస్థలు అన్నింటిలోనూ అంబుడ్స్‌పర్సన్‌ను నియమించాలని, లేదంటే ఆయా యూనివర్సిటీలపై చర్యలు ఉంటాయని పేర్కొంది. 

 

Published date : 19 Feb 2024 01:23PM

Photo Stories