Skip to main content

Direct Recruitments: యూజీసీ ప్రతిపాదనలను తిరస్కరించండి

లబ్బీపేట(విజయవాడతూర్పు): రిజర్వేషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చేసిన దుర్మార్గపు ప్రతిపాదనలను తక్షణమే తిరస్కరించా లని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఫిబ్ర‌వ‌రి 28న‌ ఓ ప్రకటనలో కోరారు.
University Grants Commission    Reject the UGC proposals   Central government  State government   BC Welfare Association

కేంద్ర విద్యా సంస్థల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు లేరనే సాకు చూపి, ఆ ఖాళీలను డీరిజర్వ్‌ చేసి, వాటిని తిరిగి జనరల్‌ అభ్యర్థులతో భర్తీ చేయాలనే ఆలోచన సరికాదని స్పష్టంచేశారు. ఈ మేరకు యూజీసీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, అన్ని యూనివర్సిటీలకు, కేంద్ర విద్యాసంస్థలకు, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికార వర్గానికి అధికారికంగా సిఫార్సులు చేసినట్లు పేర్కొన్నారు.

చదవండి: Ugc Mandatory To Apppoint Ombudspersons- అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో అంబుడ్స్‌పర్సన్‌ తప్పనిసరి..

ఈ సిఫార్సుల అసలు లక్ష్యం రిజర్వేషన్లను ఎత్తేసే కుట్రగా భావిస్తున్నామని తెలిపారు. ఈ ఆలోచనలు తక్షణమే రద్దు చేయకుంటే దేశంలో పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం చెలరేగుతుందని, తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు ప్రతిపాదనల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజానికి భారత రాజ్యాంగం విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పించిన రిజర్వేషన్లను దూరం చేసి, ఉన్నత విద్యారం గంలో ఎదగనీయకుండా, వారి అభివృద్ధిని అడ్డుకోవాలనే కుట్రలు ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఆటలను సాగనీయబోమని కేసన శంకరరావు స్పష్టంచేశారు.

Published date : 29 Feb 2024 03:22PM

Photo Stories