NBA Grade: ఎన్‌బీఏ గుర్తింపు సాధించిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల

నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ గుర్తింపును సాధించింది అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల. ఈ నేపథ్యంలో కళాశాల బృందం వారు తీసుకున్న చర్యలు, చేపట్టిన మార్పుల గురించి వివరాలను తెలిపారు.

అనంతపురం: అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు ఎన్‌బీఏ (నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌) గుర్తింపు దక్కింది. రాష్టంలో 12 పాలిటెక్నిక్‌ కళాశాలలకు ఎన్‌బీఏ గుర్తింపు దక్కగా, ఇందులో జిల్లా నుంచి అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఒక్కటే ఉండడం విశేషం. ప్రొఫెసర్‌ దినేష్‌ కుమార్‌ (ఐఐటీ, రూర్కీ) చైర్మన్‌గా ఉన్న ‘ఎన్‌బీఏ పీర్‌ టీమ్‌’ గత ఏడాది డిసెంబర్‌ 8, 9, 10 తేదీల్లో కళాశాలను సందర్శించింది.

AP University: అంతర్జాతీయ సదస్సులో ఏపీ విశ్వావిద్యాలయాలు ఎంపిక

ఇక్కడి పరిసరాలు, ల్యాబ్‌ సదుపాయాలు, కళాశాలలో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు దక్కిన ఉద్యోగాల శాతం, ఫ్యాకల్టీ లభ్యత తదితర అంశాలపై అధ్యయనం చేసింది. ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండడంతో ‘ఎన్‌బీఏ’ గుర్తింపు కల్పించారు.

Half day Schools 2024 : స్కూల్‌ పిల్ల‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఒంటిపూట బడులు ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే..?

ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో సత్ఫలితాలు..

డిప్లొమా కోర్సు చదివే ప్రతి విద్యార్థికి ఉన్నత భవిష్యత్తు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నూతన విద్యా ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. నిపుణుల సహకారంతో పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కోర్సును రూపొందించింది. విద్యా సంవత్సరం పూర్తికాగానే ఉద్యోగాలకు ఎంపికయ్యేలా నైపుణ్యాల పెంపుదలకు బాటలు పరిచింది. అందులో భాగంగానే అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కియా శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు. తద్వారా కోర్సు పూర్తికాగానే విద్యార్థులు సులువుగా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు.

Job Layoffs: ప్రపంచ టాప్‌ కంపెనీలో ఉద్యోగాల తొలగింపు.. కార‌ణం ఇదే!!

కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు 192 మందికి కొలువులు దక్కాయి. అల్ట్రాటెక్‌లో 8 మంది, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీలోలో 182 మంది, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ పరిశ్రమలో ఇద్దరు ఉద్యోగాలు సాధించారు. ఇందులో కొందరు ఏకంగా రూ.8.6 లక్షల వేతనం అందించే ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంటెక్‌ పూర్తయిన విద్యార్థులకు సైతం అంత పెద్ద మొత్తంలో ప్యాకేజీ లభించడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

Government Jobs 2024 Notification : ఈ 9 వేల‌ ప్ర‌భుత్వ ఉద్యోగాలను.. ఈ 9 నెలల్లోనే..?

ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి

కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. డిప్లొమా మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు ఇండస్ట్రియల్‌ ఓరియెంటెడ్‌ శిక్షణ ఇస్తున్నాం. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే 192 మందికి కొలువులు దక్కాయి. మరికొన్ని ఫలితాలు రావాల్సి ఉంది.

– డాక్టర్‌ రామకృష్ణా రెడ్డి, ఈఈఈ విభాగాధిపతి

WhatsApp Send Messages to Third Party Apps: వాట్సాప్‌ నుంచి వేరే యాప్‌లకూ మెసేజ్‌లు!

ఆనందంగా ఉంది..

మా కళాశాలకు ఎన్‌బీఏ గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. కళాశాలలో అధునాతన సదుపాయాలు ఉన్నాయి. అర్హులైన, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్నారు. డిప్లొమా విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.

– డాక్టర్‌ సి. జయచంద్రా రెడ్డి, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, అనంతపురం

TS DSC 2024: విధివిధానాలు, రిజర్వేషన్లు, సిలబస్‌ ఇతర వివరాలతో బులెటిన్‌ విడుదల

మాటల్లో చెప్పలేని ఆనందం

టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ కంపెనీలో ఏడాదికి రూ.8.6 లక్షల ప్యాకేజీతో కూడిన ఉద్యోగానికి ఎంపికయ్యా. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ ఏడాది మే నెలలో ఉద్యోగంలో చేరతా. బాలచంద్ర నాయక్‌ సార్‌ నిర్వహించిన స్పెషల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

– ఎస్‌.పీ ప్రశాంత్‌ కుమార్‌, ఈసీఈ, తాడిమర్రి

BSF's First Woman Sniper: బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్‌

కలలో కూడా ఊహించలేదు

మాది పామిడి. నాన్న రవీంద్ర కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ కంపెనీలో ఏడాదికి రూ.8.6 లక్షల ప్యాకేజీతో కొలువు దక్కింది. ఇంత పెద్ద మొత్తంతో కూడిన ఉద్యోగం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అధ్యాపకులు మాపై ప్రత్యేక శ్రద్ధ వహించి శిక్షణ ఇవ్వడమే ఇందుకు కారణం.

– గౌతమి, డిప్లొమా, ఈసీఈ

9000 Jobs: 9 నెలల్లో గురుకుల 9 వేల ఉద్యోగాలు! గురుకుల విద్యా సంస్థల బోర్డు రికార్డు

#Tags