Skip to main content

BSF's First Woman Sniper: బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్‌

షిమ్లా: సుదూరంగా మాటువేసి గురిచూసి షూట్‌చేసే ‘స్నైపర్‌’ విధుల్లో చేరి పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌కుమారి చరిత్ర సృష్టించనున్నారు.
BSFs first woman sniper suman kumari

సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌)లో తొలి స్నైపర్‌గా కుమారి పేరు రికార్డులకెక్కనుంది. ఇండోర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ వెపన్స్‌ అండ్‌ టాక్టిక్స్‌(సీఎస్‌డబ్ల్యూటీ)లో ఎనిమిది వారాల కఠోర శిక్షణను కుమారి విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. దీంతో శిక్షణలో ఆమె ఇన్‌స్ట్రక్టర్‌ గ్రేడ్‌ సాధించారు.

Suman Kumari

బీఎస్‌ఎఫ్‌లో స్నైపర్‌ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. కుమారి 2021లో బీఎస్‌ఎఫ్‌లో చేరారు. నిరాయుధంగా శత్రువుతో పోరాడే ‘నిరాయుధ దళం’కు గతంలోనే ఆమె ఎంపికయ్యారు. పాకిస్తాన్‌ సరిహద్దుల వెంట మాటువేసి అదనుచూసి చొరబాట్లకు తెగబడే ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో స్నైపర్‌లది కీలక పాత్ర. 

చదవండి: Women SI Success Story : గృహిణిగా.. ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూ.. ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

Suman Kumari

ఆమె విజయం:

  • సుమన్ కుమారి 8 వారాల స్నైపర్ శిక్షణ కోర్సులో 56 మంది పురుష అభ్యర్థులతో పాటు పాల్గొన్నది.
  • ఈ శిక్షణలో, ఆమె తుపాకీ కాల్పులలో అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించింది.
  • శిక్షణ ముగింపులో, ఆమె అత్యుత్తమ షూటర్‌గా నిలిచింది.

ఆమె స్ఫూర్తి:

  • సుమన్ కుమారి తన తండ్రి నుండి స్ఫూర్తి పొందింది. ఆయన కూడా భారత సైన్యంలో పనిచేశారు.
  • ఆమె ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటుంది.

బీఎస్‌ఎఫ్‌లో మహిళల పాత్ర:

  • బీఎస్‌ఎఫ్‌లో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోంది.
  • ప్రస్తుతం, బీఎస్‌ఎఫ్‌లో 2,500 మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారు.
  • వారు వివిధ రకాల బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
Published date : 04 Mar 2024 01:30PM

Photo Stories