Marriage Age: మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు
Sakshi Education
హిమాచల్‌ప్రదేశ్‌లో ఇకపై మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు.
నిర్దేశిత వయసు కంటే తక్కువ వయసున్న మహిళలకు పెళ్లి చేస్తే నేరం అవుతుంది. మహిళ కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది.
ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం–2006 స్థానంలో బాల్య వివాహాల(హిమాచల్ ప్రదేశ్) నిషేధ సవరణ–2024 చట్టం తీసుకొచ్చారు. 2006 నాటి చట్టం ప్రకారం మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లు కాగా, పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా ఉంది.
Subhadra Yojana: మహిళలకు శుభవార్త.. వారి అకౌంట్‌లో రూ.50 వేలు.. అర్హులు వీరే!
Published date : 30 Aug 2024 08:46AM