Himanchal Pradesh Assembly : ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పించన్ బంద్..
Sakshi Education
ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించి అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు పించన్ ఇవ్వొద్దని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అందరికీ ఇది వర్తిస్తుంది. ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారనే కారణంతో హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. తర్వాత జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్ల్లో ఈ ఆరుగురిలో ఇద్దరు మళ్లీ గెలవగా, నలుగురు ఓడిపోయారు. వీరి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు రాకుండా ఈ బిల్లును తీసుకొచ్చింది.
Published date : 14 Sep 2024 03:06PM