Skip to main content

Asia Pacific Ministerial Conference: ఢిల్లీలో రెండో ఆసియా–పసిఫిక్‌ మినిస్టీరియల్‌ సదస్సు

పౌర విమానయానంపై సెప్టెంబ‌ర్ 12వ తేదీ ఢిల్లీలో రెండో ఆసియా–పసిఫిక్‌ మినిస్టీరియల్‌ సదస్సు జరిగింది.
PM Modi Hails Inclusivity and Affordability Of Air Travel Under Regional Connectivity Scheme

ఈ స‌ద‌స్సుకు 29 దేశాల నంచి 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ స‌ద‌స్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలో విమానయాన రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. భారత్‌ను ప్రపంచ విమానయాన హబ్‌గా మార్చడానికి చర్యలు చేపట్టామని వివరించారు. ప్రాంతీయ అనుసంధాన పథకంతో విమాన ప్రయాణం ప్రజలందరికీ అందుబాటులోకి వస్తోందన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల నుంచి సైతం విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని వెల్లడించారు. 

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉడాన్‌’ పథకం విజయవంతంగా కొనసాగుతోందని, దీనిపై అధ్యయనం చేయాలని విదేశీ ప్రతినిధులకు సూచించారు. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో విమానయాన రంగంలో నూతన అవకాశాలు సృష్టించేందుకు ప్రయత్నించాలని కోరారు. దాంతో ఆయా దేశాల్లో ఆర్థిక వృద్ధితోపాటు నూతన ఆవిష్కరణలు, శాంతి, సౌభాగ్యానికి బాటలు వేసినట్లు అవుతుందని ఉద్ఘాటించారు. 

Semicon India 2024: సెమీకండక్టర్ల తయారీ రంగంలో 85 వేల మందికి శిక్షణ..

ఇంటర్నేషనల్‌ బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ను వైమానిక రంగంతో అనుసంధానిస్తే వివిధ దేశాలకు, ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మధ్య తరగతి ప్రజల సంఖ్య పెరుగుతుండడం, వారు సృష్టిస్తున్న డిమాండ్‌ విమానయాన రంగానికి చోదకశక్తిగా మారుతున్నాయని మోదీ స్పష్టంచేశారు. భారత్‌లో విమానయాన సంస్థల నెట్‌వర్క్, సేవలు నానాటికీ విస్తరిస్తున్నాయని తెలిపారు.

ఈ రంగంలో అధిక నైపుణ్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. ఏవియేషన్‌ సెక్టార్‌లో ‘మహిళల సారథ్యంలో ప్రగతి’కి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారత్‌లోని మొత్తం పైలట్లలో 15 శాతం మంది మహిళలు ఉన్నారని గుర్తుచేశారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 5 శాతమేనని పేర్కొన్నారు.   

PMGSY-IV: రూ.70,125 కోట్లతో అమలు చేయనున్న ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన-4

Published date : 14 Sep 2024 09:22AM

Photo Stories