Skip to main content

Semicon India 2024: నోయిడాలో ‘సెమీకాన్‌–2024’ సదస్సు.. సెమీకండక్టర్ల తయారీ రంగంలో 85 వేల మందికి శిక్షణ..

సెప్టెంబ‌ర్ 11వ తేదీ నోయిడాలో ‘సెమీకాన్‌–2024’ సదస్సు నిర్వ‌హించారు.
Semicon India 2024: PM Modi inaugurates Semicon India 2024 in Greater Noida

ఈ స‌ద‌స్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రాబట్టడానికి చర్యలు ప్రారంభించామన్నారు. ఇండియాలో ఎలక్ట్రానిక్స్‌ రంగం విలువ 150 బిలియన్‌ డాలర్లకు చేరిందని తెలిపారు. 

ఈ దశాబ్దం ఆఖరు నాటికి దీన్ని 500 బిలియన్‌ డాలర్లు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. ఈ రంగంలో వృద్ధితో సెమీకండక్టర్‌ రంగం లబ్ధి పొందుతుందని ఉద్ఘాటించారు. దేశంలో ఉపయోగించే ఎల్రక్టానిక్స్‌ పరికరాలు వంద శాతం ఇక్కడే తయారు కావాలన్నదే తమ ధ్యేయమన్నారు.

Industrial Smart Cities : 12 ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర..
 
85 వేల మందికి శిక్షణ..  
భారత్‌లో అమలవుతున్న సంస్కరణలు, స్థిరమైన ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు ఊతం ఇస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ల తయారీ రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో చిప్‌లకు డిమాండ్‌ తగ్గినా, భారత్‌లో మాత్రం పెరుగుతూనే ఉంటుందని స్పష్టంచేశారు.

ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ప్రతి ఎల్రక్టానిక్‌ పరికరంలో భారత్‌లో తయారైన చిప్‌ ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్ల డిజైనింగ్, తయారీ కోసం 85 వేల మందిని నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వీరిలో సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, ఆర్‌అండ్‌డీ నిపుణులు ఉంటారని వెల్లడించారు. ప్రపచంలో ఎక్కడా కనిపించని 3డీ పవర్‌(త్రి–డైమెన్షనల్‌ పవర్‌) ఇండియాలో ఉందని ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు.

CPCB Data: దేశవ్యాప్తంగా గాలి నాణ్యత మెరుగుపడుతున్న నగరాలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో..

Published date : 12 Sep 2024 02:51PM

Photo Stories