Skip to main content

CISF and BSF Chiefs : సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్‌కు కొత్త చీఫ్‌ల నియామకం..

New chief and director of Central Industrial Security Force and Border Security Force

కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌గా రజ్విందర్‌ సింగ్‌ భట్టి, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) చీఫ్‌గా దల్జీత్‌ సింగ్‌ చౌదరి నియమితులయ్యారు. సిబ్బంది వ్యవహారాల శాఖ బుధవారం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.

ASCI Chairman: ఏఎస్‌సీఐ నూత‌న చైర్మ‌న్‌గా పార్థ సిన్హా

భట్టి 1990 బ్యాచ్‌ బీహార్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. ఆయన వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు పదవిలో కొనసాగుతారు. చౌదరి 1990 బ్యాచ్‌ యూపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. ఆయన వచ్చే ఏడాది నవంబరు 30 వరకు బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతారు.

Published date : 06 Sep 2024 10:53AM

Photo Stories