BSF Notification 2024 : 1,526 పోస్టులకు బీఎస్‌ఎఫ్ నోటిఫికేషన్ విడుదల.. ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్షలు ఇలా..
మొత్తం 1,526 పోస్ట్‌లకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. ఎంపికైతే ప్రారంభంలోనే పే లెవల్ 4, 5లతో ఆకర్షణీయ వేతనం అందుకునే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో.. బీఎస్‌ఎఫ్ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, రాత పరీక్ష, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ టిప్స్ తదితర సమాచారం..
పోలీస్ ఉద్యోగాలంటే యువతలో ఎంతో క్రేజ్. అందుకే ఇంటర్ మొదలు ప్రొఫెషనల్ డిగ్రీల ఉత్తీర్ణుల వరకూ.. వేల మంది పోలీస్ కొలువుల కోసం పోటీ పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్మీడియెట్ అర్హతతోనే సాయుధ దళాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది బీఎస్‌ఎఫ్ తాజా నోటిఫికేషన్.
UPSC Civils Free Coaching: 'సివిల్స్' ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ ఎప్పుడంటే..
మొత్తం పోస్టులు 1,526
- బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సాయుధ దళాల్లో మొత్తం 1,526 పోస్ట్‌ల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఏఎస్‌ఐ 243 పోస్టులు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు 1,283 ఉన్నాయి.
- అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్/కంబాటెంట్ స్టెనోగ్రాఫర్), వారంట్ ఆఫీసర్ (పర్సనల్ అసిస్టెంట్): బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్)లో 17 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)లో 21 పోస్టులు, ఇండో టిబెటిన్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)లో 56 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎఎస్‌ఎఫ్)లో 146 పోస్టులు, సశస్త్ర సీమాబల్(ఎస్‌ఎస్‌బీ)లో 3 పోస్ట్‌లు చొప్పున భర్తీ చేయనున్నారు.
- హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్/కంబాటెంట్ మినిస్టీరియల్), హవాల్దార్(క్లర్క్): బీఎస్‌ఎఫ్‌లో 302 పోస్టులు, సీఆర్‌పీఎఫ్‌లో 282 పోస్టులు, ఐటీబీపీలో 163 పోస్టులు, సీఐఎస్‌ఎఫ్‌లో 496 పోస్టులు, ఎస్‌ఎస్‌బీలో 5 పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో 35 పోస్ట్‌లు ఉన్నాయి.
అర్హతలు
- ఆగస్ట్ 1, 2024 నాటికి ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి.
- వయసు: ఆగస్ట్ 1, 2024 నాటికి 18–25 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున సడలింపు లభిస్తుంది.
Cotton Corporation : కాటన్ కార్పొరేషన్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
మూడు దశల ఎంపిక ప్రక్రియ
ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్ట్‌ల భర్తీకి మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ రిటెన్ టెస్ట్, స్కిల్ టెస్ట్.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
ఇందులో భాగంగా అభ్యర్థులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలను పేర్కొన్నారు. పురుష అభ్యర్థులు 165 సెంటీమీటర్ల ఎత్తు, ఛాతీ విస్తీర్ణం 77 సెంటీ మీటర్లు(శ్వాస తీసుకున్నప్పుడు 82 సెంటీ మీటర్లు కలిగుండాలి. మహిళా అభ్యర్థులు 150 సెంటీ మీటర్లు ఎత్తు ఉండాలి. ఈ ప్రమాణాలు ఉన్న వారికి తదుపరి దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
- పీఎస్‌టీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో భాగంగా పరుగు పందెం నిర్వహిస్తారు.
- పురుష అభ్యర్థులు 1.6 కిలో మీటర్ల దూరాన్ని ఆరు నిమిషాల్లో, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల దూరాన్ని నాలుగు నిమిషాల 45 సెకన్లలో పూర్తి చేయాలి.
రాత పరీక్ష
- పీఎస్‌టీ, పీఈటీలలో ఉత్తీర్ణత సాధించిన వారికి తదుపరి దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో అయిదు విభాగాల (హిందీ /ఇంగ్లిష్, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, క్లరికల్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్) నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. ప్రతిప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్షకు అందుబాటులో ఉండే సమయం 1 గంట 40 నిమిషాలు.
- హిందీ/ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగాలకు సంబంధించి అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న విభాగాన్ని ఎంచుకోవచ్చు.
Goodnews For Infosys Employees: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్.. రూ.8 లక్షల బోనస్!
స్కిల్ టెస్ట్
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఏఎస్‌ఐ పోస్ట్‌లకు 1:30 (ఒక్కో పోస్ట్‌కు 30 మంది), హెడ్ కానిస్టేబుల్ పోస్ట్‌లకు 1:10 (ఒక్కో పోస్ట్‌కు 10 మంది) నిష్పత్తిలో అభ్యర్థుల జాబితా రూపొందించి.. వారికి తదుపరి దశలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- స్కిల్ టెస్ట్‌లో భాగంగా ఏఎస్‌ఐ అభ్యర్థులకు నిమిషానికి 80 పదాలు చొప్పున పది నిమిషాల వ్యవధిలో ఏదైనా అంశాన్ని డిక్టేట్ చేస్తారు. దాన్ని వారు ఇంగ్లిష్‌లో అయితే 50 నిమిషాల్లో, హిందీలో అయితే 65 నిమిషాల్లో కంప్యూటర్‌లో టైప్ చేయాల్సి ఉంటుంది.
- హెడ్ కానిస్టేబుల్ అభ్యర్థులు స్కిల్ టెస్ట్‌లో భాగంగా నిమిషానికి 35 పదాలు చొప్పున టైప్ చేయాల్సి ఉంటుంది.
ప్రారంభ వేతనం
పీఎస్‌టీ, పీఈటీ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్‌లలో విజయం సాధించిన వారిని తుది విజేతలుగా నిర్ణయిస్తారు. వీరికి నియామకాలు ఖరారు చేస్తారు. ఏఎస్‌ఐ ఉద్యోగాలకు పే లెవల్–5 (రూ.29,200–రూ.92,300); హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పే లెవల్ 4 (రూ.25,500 –రూ.81,100)తో ప్రారంభ వేతనం అందుతుంది.
Assistant Manager Posts at SEBI : సెబీలో ఆఫీసర్ గ్రేడ్ –ఎ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, జూలై 8.
- సీబీటీ తేదీ: 2024, అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్ (హైదరాబాద్).
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in
Indian Painted Frog: కవ్వాల్ టైగర్‌జోన్‌లో కనిపించిన ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్.. దీని పేరు ఇదే!
రాత పరీక్షలో రాణించేలా
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగంలో రాణించడానికి బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్–స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్‌లను ప్రాక్టీస్ చేయాలి. బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టుతోపాటు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి.. అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షలో నిర్దేశించిన మాదిరిగా క్రోడీకరించడానికి సాధన చేయాలి.
జనరల్ ఇంటెలిజెన్స్
ఈ విభాగంలో స్కోర్ కోసం వెర్బల్, నాన్–వెర్బల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, విజువల్ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్ సిరిస్, కోడింగ్–డీకోడింగ్, నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రమ్స్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
TS Inter Supplementary Exams Results 2024 Release Date : తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఎప్పుడంటే..? ఈ సారి రిజల్డ్స్ కోసం..
న్యూమరికల్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో మంచి మార్కుల కోసం ప్యూర్ మ్యాథ్స్‌తోపాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ప్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్ అండ్ లాస్, అల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.
క్లరికల్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో స్కోర్ కోసం డేటా చెకింగ్, కంపేరిజన్, స్పెల్ చెక్, స్పాటింగ్ ద ఎర్రర్స్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
కంప్యూటర్ నాలెడ్జ్
ఈ విభాగంలో రాణించేందుకు బేసిక్ కంప్యూటర్ ఫండమెంటల్స్, కంప్యూటర్స్ వినియోగం, ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ ఆఫీస్ టూల్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈ–మెయిల్ అంశాలపై దృష్టి పెట్టాలి.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
రాత పరీక్ష కంటే ముందు నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో రాణించడానికి అభ్యర్థులు రాత పరీక్ష ప్రిపరేషన్ దశ నుంచే ఆ దిశగా కృషి చేయాలి. ప్రతి రోజు కనీసం రెండు గంటలు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో పేర్కొన్న అంశాలను ప్రాక్టీస్ చేయాలి. ఈ ఫిజికల్ ప్రాక్టీస్ ఉదయం వేళల్లో చేస్తే శారీరక అలసటకు దూరంగా ఉండొచ్చు. ఇలా దరఖాస్తు సమయం నుంచే సన్నద్ధత పొందితే విజయావకాశాలు మెరుగవుతాయి.
Tags
- BSF Recruitment 2024
- notification
- Border Security Force
- Training
- written and physical tests
- Eligible applicants
- various posts at bsf
- online applications
- written test preparation for bsf
- Border Security Force Jobs
- BSF Notification 2024
- Armed forces recruitment
- Internal security jobs
- BSF preparation tips
- BSF selection process
- latest jobs in 2024
- sakshieducation latest job notifcations