Job Layoffs: ప్రపంచ టాప్ కంపెనీలో ఉద్యోగాల తొలగింపు.. కారణం ఇదే!!
తాజాగా ప్రపంచ టాప్ కంపెనీలలో ఒకటైన గూగుల్‌కు చెందిన యూట్యూబ్ మ్యూజిక్ విభాగం నుంచి 43 మంది ఉద్యోగులను తొలగించారు.
కారణం ఇదే..!
కొన్ని మీడియా కథనాల ప్రకారం, యూట్యూబ్ మ్యూజిక్‌లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ఈ ఉద్యోగులు మెరుగైన వేతనం, ఇతర ప్రయోజనాలు కోసం డిమాండ్ చేయడంతో వారిని ఉద్యోగాల నుండి తొలగించారు. ఈ ఉద్యోగులు గూగుల్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో, సబ్‌కాంట్రాక్ట్‌గా కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్నారు.
గూగుల్ స్పందన..
అయితే ఈ ఉద్యోగాల తొలగింపులకు గూగుల్ బాధ్యత వహించదని స్పష్టం చేసింది. తొలగించబడిన ఉద్యోగులకు కంపెనీలో ఇతర స్థానాలను కల్పించేలా ఏడు వారాల గడువు ఉంటుందని తెలిసింది.
స్పందించిన బాధితులు..
ఈ తొలగింపులపై బాధిత ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు నోటీసు లేకుండా తమను ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని ఆరోపిస్తున్నారు. యూట్యూబ్ డేటా అనలిస్ట్ జాక్ బెనెడిక్ట్ ఒకరు, ఈ విషయంపై యూనియన్ చర్చలకు సిద్ధమైనట్లు తెలిపారు.
ఇదే ట్రెండ్ కొనసాగుతుందా..?
టెక్ కంపెనీలలో ఉద్యోగాల తొలగింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ ఎలా ఉంటుందో చూడాలి.