Students Talent: ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటి ఏపీయూలో సీటు సాధించిన యువకులు వీరే!
బెల్లంపల్లి: అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ(ఏపీయూ)కి బెల్లంపల్లిలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ(సీఓఈ) విద్యార్థులు ముగ్గురు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో రెండో దఫా జరిగిన రాత పరీక్షల్లో ప్రతిభను చాటారు.
గురువారం వెలువడిన ఫలితాల్లో సీఓఈలోని ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దుగుట అంజి బీఏ హానర్స్(సోషల్ సైన్స్), ఎలుపుల రాజేందర్, గొల్ల బలరాముడు బీఏ హానర్స్(హిస్టరీ)లో అడ్మిషన్ సాధించినట్లు సీఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ప్రకటించారు.
Distance Education: దూరవిద్య డిగ్రీ ఫలితాల విడుదల,రీవాల్యుయేషన్ దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..
వీరికి బోపాల్ యూనివర్సిటీలో సీటు వచ్చినట్లు వెల్లడించారు. సదరు విద్యార్థులు 2024–25 సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేషన్ చదవనున్నారు. విద్యార్థులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ రీజినల్ కోఆర్డినేటర్ కొప్పుల స్వరూపారాణి ప్రత్యేకంగా అభినందించారు.
కాగా, అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ గత జనవరిలో మొదటి దఫా అడ్మిషన్ టెస్ట్ ఫలితాలను వెల్లడించింది.
Teachers: ఉపాధ్యాయ ఉద్యోగ కల.. నెరవేరిందిలా..
ఈ ఫలితాల్లో సీఓఈ విద్యార్థులు పుల్లూరి దీపక్, గడపల సుమేధ్, నగమళ్ల గణేష్, బత్తుల మధు, బండారి శివమూర్తి అండర్ గ్రాడ్యుయేషన్‌లో సీటు దక్కించుకున్నారు.
కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సదరు విద్యార్థులను ప్రిన్సిపాల్ సైదులు, అధ్యాపకులు అభినందించారు. వైస్ ప్రిన్సిపాల్ కోట రాజ్‌కుమార్, అధ్యాపకులు, సీఓఈ కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పూదరి నగేష్‌గౌడ్, గోగర్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Tags
- Bhopal University
- Entrance Exam
- students talent
- new academic year
- Azim Premji University
- Center of Excellence
- Boys Gurukula
- Admission at APU
- under graduation
- Education News
- Sakshi Education News
- Mancherial District News
- Telangana Education
- Social welfare students
- National level exams
- Student achievements
- SakshiEducationUpdates