Skip to main content

Intermediate First Year Admissions: తెలంగాణ మోడ‌ల్ స్కూల్లో ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రానికి ద‌ర‌ఖాస్తులు..

ఆస‌క్తి ఉన్న విద్యార్థులు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో ప్రవేశం పొందేందుకు కింద ప్ర‌క‌టించిన వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోండి..
Apply Now for 10th Standard Passouts  Telangana Model School  Intermediate first year admissions at Telangana Model Schools  Admissions Open for First Year Intermediate

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ ఖలీల్‌ తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ నెల 25లోగా www.tsmodelschools.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో గ్రూపునకు 40 చొప్పున 160 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రోస్టర్‌ మెరిట్‌ ప్రకారం సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 27న ఎంపిక జాబితా విడుదల, 29 నుంచి 31 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు.

ITI Admissions 2024: ఐటీఐ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ ఎప్పుడంటే..

Published date : 11 May 2024 03:11PM

Photo Stories