Jobs: కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తులు

మంచిర్యాలటౌన్‌: తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌, జిల్లా ఆసుపత్రుల ప్రధాన అధికారి కార్యాలయం, మంచిర్యాల పరిధిలోని ఆసుపత్రుల్లో పనిచేసేందుకు ఒప్పంద, పొరుగు సేవల పద్ధతిన పనిచేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయ పర్యవేక్షకులు డాక్టర్‌ అరవింద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తులు

ఒప్పంద పద్ధతిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్స్‌ 10, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ 1, పొరుగు సేవల పద్ధతిన సిటి స్కాన్‌ టెక్నీషియన్‌ 1, ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌2 ఒకటి, థియేటర్‌ అసిస్టెంట్‌ 1 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. మార్చి 31, 2024 వరకు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అవసరం మేరకు నియామకం జరుగుతుందన్నారు.

సెప్టెంబర్‌ 1వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి 8వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కార్యాలయ పనివేళల్లో జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయంలో దరఖాస్తుతోపాటు, సంబంధిత ధ్రువపత్రాల నకలు ప్రతులను సమర్పించాలని, వివరాలు www. mancherial.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఉన్నాయని వెల్లడించారు.

చదవండి:

GGH Recruitment 2023: జీజీహెచ్, నిజామాబాద్‌లో పారా మెడికల్‌ పోస్టులు.. నెలకు రూ.30,000 వ‌ర‌కు జీతం..

TS Gurukulam Teacher Jobs: టీఎస్‌ గురుకులాల్లో 9,231 పోస్టులు.. విజయం సాధించే మార్గాలు ఇవే..

#Tags