TS Half Day Schools & Holidays 2023 : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మార్చి 15వ తేదీ నుంచే ఒంటిపూట బడులు.. అలాగే వేస‌వి సెల‌వులు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : మార్చి 15వ తేదీ నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. అలాగే ఏప్రిల్ 25వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
TS Half Day Schools & Holidays 2023 Details

ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఒంటిపూట బడి సమయాల్లో అన్ని పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. తెలంగాణ పాఠ‌శాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

పగలు ఎండ దంచి కొడుతుంది. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. స్కూల్స్‌లోని విద్యార్థులు వేడికి మరింత ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది.

☛➤ Ap Schools Summer Holidays 2023 : స్కూళ్లకు మొత్తం వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..? ఈ సారి ముందుగానే..

ఈ సారి కూడా భారీగానే..

ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూల్స్‌కు ఈ ఏడాది వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ ఇటీవల వెల్లడించిన విష‌యం తెల్సిందే. తిరిగి పాఠశాలలు జూన్ 12న పాఠశాలలు పున: ప్రారంభం అవ్వనున్నాయి. మొత్తం 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి.

☛ TS Schools Summer Holidays 2023 : విద్యార్థులకు శుభ‌వార్త‌.. ఈ సారి భారీగానే వేసవి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ప‌రీక్ష‌లు ఇలా..

1వ త‌ర‌గ‌తి నుంచి 9వ‌ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2(ఎస్ఏ) పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి ప‌రీక్ష‌ల‌ను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం 1వ త‌ర‌గ‌తి నుంచి 5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే ఉన్నందున వారికి ఎగ్జామ్స్ ఏప్రిల్ 17వ తేదీతో పూర్తి అవుతాయి. 6వ త‌ర‌గ‌తి నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు ప‌రీక్ష‌లు ఉంటాయి.

☛➤ Schools and Colleges Holiday 2023 : మార్చి నెలలో స్కూళ్లు, కాలేజీలకు 8 రోజులు సెలవులు.. ఎలా అంటే..?

☛➤ AP & TS Schools Summer Holidays 2023 : ఏపీ, తెలంగాణ స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులు ఎన్ని రోజులంటే..?

ఆరు, ఏడో తరగతి విద్యార్థులకు..

ఈ పరీక్షలకు సంబంధించిన ఫ‌లితాల‌ను ఏప్రిల్ 21వ తేదీన‌ విద్యార్థులకు వెల్లడించి.. రికార్డుల్లో నమోదు చేయాలని విద్యాశాఖ ఒక‌ ప్రకటనలో పేర్కొంది. 1వ త‌ర‌గ‌తి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలుంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఆరు, ఏడో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప‌రీక్ష‌లు ఉంటాయని పేర్కొన్నారు.

☛➤ AP Half Day Schools 2023 : ఏపీ ఒంటి పూట బడులు ఎప్పుటి నుంచి అంటే...? ఈసారి వేస‌వి సెల‌వులు భారీగానే ..!

#Tags