Tenth and Inter Public Exams : ఇక‌పై.. ఏడాదికి రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు.. కొత్త‌ రూల్స్ ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో భారీగా మార్పులు రానున్నాయి. ఈ మేర‌కు కేంద్రం పలు కీలక మార్పులకు సిద్ధమైంది. ఇకపై ఇంటర్‌లో ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని, భారతీయ భాషలు తప్పనిసరిగా చదవాలని నూతన కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌సీఎఫ్‌) ప్రతిపాదనలు చేసింది.
Tenth and Inter Board exams to be conducted twice a year rules

అలాగే, 9–12 తరగతుల విద్యార్థులకు కనీస సబ్జెక్టుల సంఖ్యను పెంచాలని చెప్పింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఎన్‌సీఎఫ్‌ నివేదికను ఆగస్టు 23న జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలికి అందించారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

ఆయా సబ్జెక్టుల్లో ఉత్తమ స్కోరు ఎంచుకునే అవకాశం..
నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో కేంద్రం పలు కీలక మార్పులకు సిద్ధమైంది. టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించనున్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో ఉత్తమ స్కోరు ఎంచుకునే అవకాశం ఉంటుంది. పరీక్షలు సెమిస్టర్‌ పద్ధతిలో పెడతారా, లేక మొత్తం సిలబస్‌పై రెండు సార్లు నిర్వహిస్తారా అనే విషయంపైనా; ఎప్పటి నుంచి అమలు చేస్తారనే అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది. 

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ఈ విధానం అమలుకు తొలుత రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాలి. అప్పుడే రాష్ట్రాల్లో అమల్లోకి వస్తుంది. పాఠశాల విద్యకు సంబంధించిన కొత్త కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ రూపొందించిన కేంద్ర విద్యాశాఖ గత ఏప్రిల్‌లో ముసాయిదా విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలను, సూచనలు స్వీకరించి తుది నివేదికను ఇటీవ‌లే విడుదల చేసింది. 

రూల్స్ ఇలా..

11, 12 తరగతుల(ఇంటర్‌) విద్యార్థులు రెండు భాషా సబ్జెక్టులను కచ్చితంగా అభ్యసించాలి. వాటిల్లో ఒకటి భారతీయ భాష అయి ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం సీబీఎస్‌ఈ తదితర జాతీయ బోర్డుల పరిధిలో ఒక భాషా సబ్జెక్టును మాత్రమే చదువుతున్నారు. ఇక నుంచి ఆంగ్లంతోపాటు ఒక భారతీయ భాషను చదవాల్సి ఉంటుంది. నూతన విద్యా విధానానికి అనుగుణంగానే 2024 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

వీటికి స్వస్తి చెప్పేలా కొత్త పరీక్షల విధానం.. ఇలా..

బట్టీ చదువులకు స్వస్తి చెప్పేలా కొత్త పరీక్షల విధానం ఉంటుందని తెలిపింది. సబ్జెక్టులపై పూర్తి అవగాహన, ప్రాక్టికల్‌ నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం లక్ష్యంగా మార్పులు చేశారు. జాతీయ కురికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను పరిశీలించి రాష్ట్ర కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించుకుంటాం. ముందుగా దాన్ని రాష్ట్రం అమలుచేసే విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్‌ఈసీఆర్‌టీ అవసరమైన ప్రక్రియను ప్రారంభిస్తుంది.

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్

ఇంటర్‌లో ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌ అనే గ్రూపులుండవు. విద్యార్థులు ఆసక్తి ఉన్న సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. అది 9వ తరగతి నుంచే మొదలవుతుంది. చివరి రాత పరీక్షలకే కాకుండా ఆర్ట్‌, ఫిజికల్‌, ఒకేషనల్‌ విద్యకు కూడా మార్కులుంటాయి. భవిష్యత్తులో విద్యార్థి కోరుకున్న సమయంలో పరీక్షలు జరిపే విధానాన్ని అందుబాటులోకి తెస్తారు.

ప్రస్తుతం సెకండరీ అంటే 10, సీనియర్‌ సెకండరీ అంటే 11, 12 తరగతులు. ఇక నుంచి సెకండరీని రెండు దశలుగా విభజిస్తారు. 9, 10 తరగతులు ఒకటి, 11, 12 తరగతులు మరొకటిగా ఉంటుంది. సెకండరీ దశను భిన్న సబ్జెక్టులు చదువుకునే మల్టీ డిసిప్లినరీ విద్యగా మారుస్తారు.

ఏటా రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు ఏ పరీక్షలో అయితే ఉత్తమ మార్కులు సాధిస్తారో వాటినే ఎంచుకునే అవకాశం ఉంటుందని కేంద్ర విద్యాశాఖ చెప్పింది. ఏటా రెండుసార్లు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ విధానంతో విద్యార్థుల‌కు మేలు జ‌రిగే అవ‌కాశం ఉంది.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్

#Tags