MANUU: ‘మనూ’లో కొత్త కోర్సు

Maulana Azad National Urdu University(MANUU)లో మరో కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టినట్లు సెప్టెంబర్‌ 2న యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎస్‌కే ఇస్తియాక్‌ అహ్మద్‌ తెలిపారు.
‘మనూ’లో కొత్త కోర్సు

2022–23 విద్యా సంవత్సరం నుంచి MA Legal Studies Programmeను Nalsar University of Law Hyderabad సహకారంతో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. సెల్ఫ్‌–ఫైనాన్స్‌ కేటగిరీ కింద ఈ కోర్సును అందిస్తామని చెప్పారు. సెమిస్టర్‌కు ట్యూషన్‌ ఫీజుగా రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏ గ్రాడ్యుయేట్‌ అయినా ఆన్‌లైన్‌ ద్వారా సెప్టెంబర్‌ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నల్సార్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఫైజాన్‌ ముస్తఫా సహా న్యాయశాస్త్రంలో ప్రముఖ అధ్యాపకులు బోధనలో పాలుపంచుకుంటారని చెప్పారు. కాగా, ఉర్దూ వర్సిటీలోని ఇతర కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా సెప్టెంబర్‌ 6 చివరి తేదీ అని ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. 

చదవండి: 

#Tags