‘ట్రాన్స్ జెండర్స్’కు హాస్టల్ కేటాయించిన యూనివర్సిటీ?
లేడీస్ హాస్టల్–6లో ఏర్పాట్లు..
నల్సార్‌లో బాలికల హాస్టల్–6 భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌ను పూర్తిగా లింగ గుర్తింపు లేని (జెండర్ న్యూట్రల్)వారికోసం కేటాయించారు. అకడమిక్ బ్లాక్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో లింగ గుర్తింపు లేనివారి కోసం వాష్‌రూమ్స్ ను ఏర్పాటు చేశామని నల్సార్ వైస్ చాన్స్‌లర్ ఫైజాన్ ముస్తఫా మార్చి 27న ట్విట్టర్‌లో తెలిపారు. ఇక ‘జెండర్, సెక్సువల్ మైనారిటీ’అంశాలపై సమగ్ర విద్యా విధానం కోసం యూనివర్సిటీ ట్రాన్స్ పాలసీ కమిటీ ముసాయిదా విధానాన్ని త్వరలో అమలు చేయనుంది. 2015 జూన్ లో నల్సార్‌లోని ఓ 22 ఏళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌లో జెండర్ గుర్తింపు వద్దని వర్సిటీ ప్రతినిధులను అభ్యరి్థంచగా..ఆ అభ్యర్థనను ఆమోదించి..సదరు స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌లో జెండర్ కాలమ్‌లో మిస్టర్, మిస్‌కి బదులుగా ‘ఎంఎక్స్’గా పేర్కొంటూ సరి్టఫికెట్‌ను జారీ చేసింది.
చదవండి: