నల్సార్‌లో దూరవిద్య కోర్సులు
Sakshi Education
హైదరాబాద్: న్యాయశాస్త్రంలో దూరవిద్య ద్వారా నాలుగు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులను నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్(నల్సార్) యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది.
2015-16 విద్యా సంవత్సరానికి ఏడాది వ్యవధి కలిగిన .. పేటెంట్స్ లా, సైబర్ లాస్, మీడియా లాస్, ఇంటర్నేషనల్ హ్యుమనిటేరియన్ లాస్ కోర్సుల్లో ప్రవేశానికిఅర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆయా కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఏదేని యూనివర్సిటీ నుంచి ఏదో ఒక సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీ ఏప్రిల్ 30. దర ఖాస్తు, ఇతర వివరాలను www.nalsarpro.org వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రవేశం పొందిన అభ్యర్థులకు వారాంతాల్లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో కాంటాక్ట్ తరగతులను నిర్విహ స్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్, ముంబై, పుణె, అహ్మదాబాద్, ఢిల్లీ..తదితర కేంద్రాల్లో అభ్యర్థులు కాంటాక్ట్ తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సందేహాలకు 040-23498404/02 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని వర్సిటీ కో-ఆర్డినేటర్ వివేకానందన్ తెలిపారు.
Published date : 23 Mar 2015 03:04PM