BRAOU: పీజీ పరీక్షల తేదీలు ఇవే..

బంజారాహిల్స్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సా ర్వత్రిక విశ్వవిద్యాలయ పీజీ పరీక్షలు జూలై 3 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్ర ణ అధికారి డాక్టర్‌ పి.వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు.
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సా ర్వత్రిక విశ్వవిద్యాలయ పీజీ పరీక్షల తేదీలు ఇవే..

పీజీ ఎకనామిక్స్, హిస్టరీ, పొ లిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ, మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అన్ని డిప్లొమాలు, సర్టిఫికెట్‌ కోర్సుల పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

చదవండి: BRAOU: అంబేడ్కర్‌ వర్సిటీ డైరెక్టర్‌గా ఎల్‌వీకే

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు విశ్వవిద్యాలయ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నా రు. ఫీజులు ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలని సూచించారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ జూన్‌ 2 అని తెలిపారు. వివరాలకు అభ్యర్థులు విశ్వవిద్యాలయ హెల్ప్‌డెస్క్‌ నంబర్‌ 7382929570ను సంప్రదించవచ్చన్నారు.

చదవండి: BRAOU: అంబేడ్కర్‌ వర్సిటీ అకడమిక్‌ డైరెక్టర్‌గా TSPSC మాజీ చైర్మ‌న్‌

#Tags