BRAOU: అంబేడ్కర్ వర్సిటీ డైరెక్టర్‌గా ఎల్‌వీకే
ఈమేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉత్తర్వులు జారీ చేశారని ఎల్‌వీకే ఏప్రిల్ 13న ఇక్కడి విలేకరులకు ఫోన్ ద్వారా తెలిపారు. 2022 జూలై నుంచి ఎల్‌వీకే అంబేడ్కర్ వర్శిటీకి ఇన్‌చార్జి డైరెక్టర్‌గా సేవలందించారు. ఇటీవల పదోన్నతితో జాయింట్ డైరక్టర్‌గా నియమింపబడ్డ ఆయన ఇప్పుడు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గతంలో ఆయన జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పనిచేశారు.
చదవండి: BRAOU: అంబేడ్కర్ వర్సిటీ అకడమిక్ డైరెక్టర్‌గా TSPSC మాజీ చైర్మన్
ఆ అనుభవంతో గతంలోని ప్రభుత్వం సమాచార, పౌరసంబంధాల శాఖలో సిబ్బందికి శిక్షణ, పునశ్చరణ కోసం ఆయనను ప్రత్యేక అధికారిగా నియమించింది. 2020 మార్చి నుంచి దాదాపు రెండేళ్లపాటు నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్టార్‌గా కూడా ఎల్‌వీకే పనిచేశారు. ఆయన సంపాదకత్వంలో ఎనిమిది పుస్తకాలు వెలువడ్డాయి.
చదవండి: 11 యూనివర్సిటీల్లో 2,837 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ.. మోక్షమెప్పుడో..?