Jagananna Videshi Vidya Deevena Scheme: విదేశీ కల విద్యా దీవెనతో సాకారం.. 21 మందికి రూ.3.37 కోట్లు అందజేత

సాక్షి, విశాఖపట్నం : ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల విదేశీ చదువుల కలని ప్రభుత్వం నెరవేరుస్తోంది. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి విద్యార్థికి ఆపన్న హస్తం అందిస్తోంది. వరుసగా రెండో ఏడాది జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాకు సంబంధించి 2023లో జగనన్న విదేశీ విద్యా దీవెనకు అర్హులైన ఐదుగురికి రూ.80,55,411, 2022లో అర్హులైన 16 మందికి రెండో విడతగా రూ.2,57,36,834 చొప్పున మొత్తం రూ.3,37,92, 245 సాయం అందజేశారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో అర్హులైన 21 మంది విద్యార్థులకు మెగా చెక్కు రూపంలో ప్రజా ప్రతినిధులతో కలిసి జేసీ అందజేశారు. ఈ సందర్భంగా జేసీ విశ్వనాథన్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల విద్యార్థుల కలలు సాకారం చేసేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ పథకానికి అర్హులైన వారందరికి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేసినట్లు వివరించారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పి.రవీంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థులు ఈ విదేశీ విద్యా దీవెన పథకాన్ని వినియోగించుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ పల్లా చినతల్లి, క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జాన్‌వెస్లీ, నగరాల చైర్‌పర్సన్‌ పిల్లా సుజాత, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కె.రామారావు, బీసీ వెల్ఫేర్‌ అధికారి శ్రీదేవి, జిల్లా అల్పసంఖ్యాకుల సంక్షేమాధికారి ఎమ్‌ఏ రహీమ్‌, కార్పొరేటర్లు ఫరూఖ్‌, షరీఫ్‌, సాధిఖ్‌, బర్కత్‌ అలీతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Jagananna Videshi Vidya Deevena Scheme: పేద విద్యార్థులకు ప్రోత్సాహకరం.. 11 మంది లబ్ధిదారులకు రూ.85.88 లక్షలు...

మాస్టర్స్‌ సీటుకు ఆర్థిక సాయమందించారు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మా కుటుంబ సభ్యుడిలా ఆలోచిస్తున్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన సంక్షేమ పథకాల్ని ప్రవేశపెడుతున్నారు. కార్నిగీ మెల్లాన్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుకోవటానికి సీటు వచ్చింది. అయితే దానికి రూ.80 లక్షల వరకూ ఖర్చవుతాయి. ఇంట్లో పరిస్థితి అంతంత మాత్రమే. ఏం చేయాలో తోచని సమయంలో విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తు చేసుకున్నాను. రెండు విడతల్లో రూ.80 లక్షలు అందించారు. మా కుటుంబమంతా జగనన్నకు రుణపడి ఉంటాం.
– ఎ.వెంకట శుభ అనీష్‌, అక్కయ్యపాలెం

#Tags