Skip to main content

Jagananna Videshi Vidya Deevena Scheme: పేద విద్యార్థులకు ప్రోత్సాహకరం.. 11 మంది లబ్ధిదారులకు రూ.85.88 లక్షలు...

jagananna videshi vidya deevena scheme for students in West Godavari District, AP

సాక్షి, భీమవరం: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేద విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉందని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో 11 మంది లబ్ధిదారులకు రూ.85.88 లక్షల నమూన చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ. 1.25 కోట్లు, ఇతర విద్యార్థులకు రూ.కోటి వరకు నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా కల్పించిందన్నారు. ప్రపంచంలోని ప్రముఖ వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులు చదువుకునేలా ప్రభుత్వం ఊతమివ్వడం చారిత్రాత్మకమన్నారు. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీఎల్‌డీఓ కేసీహెచ్‌ అప్పారావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి గణపతిరావు, సాంఘిక సంక్షేమ శాఖాధికారి కె.శోభారాణి, జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి డి.పుష్పరాణి పాల్గొన్నారు.

Jagananna Videshi Vidya Deevena Scheme: విదేశీ విద్యా దీవెనతో ప్రతిభకు పట్టం

Published date : 28 Jul 2023 03:22PM

Photo Stories