Civil Ranker Story: ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నా.. నాలుగు సార్లు ఫెయిల్ అయ్యా.. కానీ..

యూపీఎస్సీ 2022 సివిల్‌ సర్వీసెస్ ఫ‌లితాల్లో ఈ సారి ఉత్తమ ర్యాంకులతో తెలుగువారు సత్తా చాటారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సివిల్స్‌–2021 తుది ఫలితాలను మే 30న విడుదల చేసిన విష‌యం తెల్సిందే.
Mantina Maurya Bharadwaj Success Story

ముఖ్యంగా టాప్‌–100 ర్యాంకర్లలో 11 మంది తెలుగు వారే నిలిచారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యువకుడు మంతిన మౌర్య భరద్వాజ్‌ 28వ ర్యాంకు సాధించారు. ఈ నేప‌థ్యంలో యూపీఎస్సీ సివిల్స్ 28వ ర్యాంక‌ర్ మౌర్య భరద్వాజ్ స‌క్సెస్ స్టోరీ మీకోసం.. 

UPSC Civils Topper Shruti Sharma : సివిల్స్ టాప‌ర్ శృతి శర్మ.. స‌క్సెస్ సిక్రెట్‌ ఇదే..

కుటుంబ నేప‌థ్యం : 
తండ్రి సత్యప్రసాద్‌ హైస్కూల్‌లో హెచ్‌ఎంగా, తల్లి రాధాకుమారి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. సోదరుడు ఎయిమ్స్‌లో సర్జన్‌గా సేవలందిస్తున్నారు.

నా ఎడ్యుకేషన్ ఇలా.. : 
2014లో ఎన్‌ఐటీ వరంగల్‌లో ఎలక్ట్రికల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ మోర్యా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా చేరారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చినా, నాకెలాంటి సంతృప్తి కలగలేదు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ అధికారి కావాలనే కోరిక ఉంది కాబట్టి నా కలను సాకారం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. 2020లో ఉద్యోగం వదిలేసి పరీక్షకు ప్రిపేర్ అయ్యాను.

Yaswanth Kumar Reddy, Civils 15th Ranker: సివిల్స్‌లో నా స‌క్సెస్‌కు కార‌ణం ఇదే.. వీరు లేకుంటే..

ఐదుసార్లు ప్రయత్నం చేసి..


2017 నుంచి వరుసగా ఐదుసార్లు ప్రయత్నం చేసి చివరకు లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. నాలుగు సార్లు పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ.. మళ్లీ చెక్కుచెదరని పట్టుదలతో పరీక్ష రాసి సక్సెస్ అయ్యారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప‌రీక్షను ఛేదించడానికి సహనం, పట్టుదల కీలకమని మంత్రి మౌర్య భరద్వాజ్  చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ అధికారి కావాలని కలలు కంటున్న మౌర్య.. తన కుటుంబం గర్వపడేలా చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

UPSC Civils Ranker -2021: పిచ్చోడన్నారు.. తూటాలు దింపారు.. ఈ సివిల్స్ ర్యాంక‌ర్ స్టోరీకి షాక్ అవ్వాల్సిందే.. 

తన రిజల్ట్ తెలియగానే.. 
యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో 28వ ర్యాంక్ వ‌చ్చింద‌ని తెలియ‌గానే.. చాలా సంతోషప‌డ్డాన‌ని మౌర్య చెప్పుకొచ్చారు. నా తల్లిదండ్రులు మాకు మంచి విద్యను అందించాలని ఎల్లప్పుడూ అనేవారు అని.. నా సక్సెస్‌లో వీరి పాత్ర‌ కీలకం అన్నారు.

రెండుసార్లు ఇంటర్వ్యూలో..
నేను ఇంటర్వ్యూ రౌండ్‌కి రెండుసార్లు చేరుకోగలిగాను, అయినప్పటికీ నేను ఫైనల్ సెలక్షన్‌లో స్థానం సంపాధించలేకపోయాను. కానీ ఇప్పుడు విజయం సాధించి నా కుటుంబం గర్వపడేలా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా కల నిజమైంది. నేను మెరుగైన ర్యాంక్ ఆశించాను, కానీ 28 కూడా మంచి ర్యాంకే అని మౌర్య పేర్కొన్నారు. తొలి ప్రయత్నాల్లో నేను పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాను. పరీక్షలకు ప్రయత్నిస్తున్నప్పుడు నేను నా ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాను.

Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి

ఉద్యోగం చేస్తూనే..
ఉద్యోగం చేస్తూనే.. ప్రిపరేషన్ కోసం ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ అయిన సివిల్స్ డైలీలో చేరారు. పరీక్షలకు సిద్ధం కావడానికి యూట్యూబ్, టెలిగ్రామ్ కొత్త లెటర్ పేజీలతో సహా ఇతర ప్లాట్‌ఫామ్‌లు ఫాలో అయినట్లు ఆయన వెల్లడించారు.

నా ఇంటర్వ్యూ జ‌రిగిందిలా..
నా ఇంటర్వ్యూ నాకు అంత భయం కలిగించలేదు. నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలలో పాల్గొన్నాను. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు పెద్ద సమస్సే కాదు అని మౌర్య అన్నారు.

UPSC Ranker Shivangi Goyal: వీళ్ల హింస‌ను భ‌రించ‌లేక పుట్టింటికి వ‌చ్చా.. ఈ క‌సితోనే సివిల్స్‌ ర్యాంక్ కొట్టానిలా..

నా స‌ల‌హా :


యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించడం ఆపకూడదు. ఈ పరీక్షలో చాలా పరిమితమైన సీట్లు ఉన్నాయి. అన్ని ఛాలెంజ్‌లను దాటుకొని ఫైనల్ సెలక్షన్‌లో నిలవాలంటే చాలా అంశాలు పాత్ర పోషిస్తాయి. కనుక ఫెయిల్యూర్ పలకరించినప్పుడు చాలా తేలిగ్గా తీసుకోండి. మీరు దృఢ సంకల్పంతో కష్టపడి పనిచేస్తే విజయం మీ వెంటే వస్తుంద‌న్నారు. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు కంపల్సరీగా ఒక బ్యాకప్ ఉంచుకోవాలని.. బ్యాకప్ అనేది మనశ్శాంతిని ఇస్తుందని.. మరింత నమ్మకంగా ప్రిపేర్ కావడానికి సహాయపడుతుందన్నారు. పరీక్ష హాల్‌కి నమ్మకంగా వెళ్లండి.. ఆందోళన పడకండి. ప్రిలిమ్స్ పరీక్షలలో ఆత్మవిశ్వాసమే పెద్ద ప్లస్ పాయింట్ అని అభ్యర్థులకు సలహా ఇచ్చారు.

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

నా ల‌క్ష్యం ఇదే..
 ‘పేదల జీవన ప్రమాణాలు పెంచే దిశగా నా వంతు కృషి చేస్తాను.. విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు మరింత సేవ చేయాలన్నదే నా అభిమతం’ అని భరద్వాజ చెప్పారు.

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

#Tags