IAS Success Story : మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ 2వ ర్యాంక్ కొట్టా.. కలెక్టర్ అయ్యా.. కానీ నా భర్త..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ లో విజయం సాధించి... ఐఏఎస్‌గా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఒక జిల్లాకు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేణు రాజ్ ఐఏఎస్ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
రేణు రాజ్.. కేరళలోని కొట్టాయంకి చెందిన వారు. తన చదువంతా కొట్టాయంలోనే సాగింది. తన తండ్రి ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. తన తల్లి గృహిణి. వాళ్ళు ముగ్గురు అక్కాచెల్లెళ్ళు. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు కూడా డాక్టర్లే. తను కూడా డాక్టర్ కోర్సులో చేరి చదువును పూర్తి చేసింది. అనంతరం.. వైద్య సాధన ప్రారంభించింది.
☛ IAS Officer Success Story : ఇందుకే కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేశా..
ఈ కోరికతోనే..
కానీ తన కోరిక మేరకు సివిల్ సర్వీసెస్ లోకి వెళ్లాలనుకుంది. తను డాక్టర్‌గా కొంత మంది రోగులకు మాత్రమే సహాయపడతానని, సివిల్స్‌లోకి వెళితే వేలమంది జీవితాలని సరిదిద్దే మార్గం ఉంటుందని తెలిపింది. ఈ కోరికతో రేణు డాక్టర్‌గా సాధన చేస్తూనే, యూపీఎస్‌సీ పరీక్షకు సిద్ధపడింది.
☛ 22 ఏళ్లకే ఐఏఎస్‌కు ఎంపికై..రెండేళ్లకే ఉద్యోగానికి రాజీనామా..ఆ తర్వాత ఉచితంగా
యూపీఎస్సీ సివిల్స్ ప్రయాణం ఇలా..
రేణు రాజ్.. ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య వృత్తిని ప్రారంభించింది. అదే సమయంలో.. ఆమె సివిల్స్ పరీక్షకు కూడా చదువుకుంటూ ఉండేది. రోజుకు 3 నుంచి 6 గంటల పాటు సివిల్స్ చదువుకునేది. ఇలా ఏడు నెలల పాటు ఈ ప్రిపరేషన్ కొనసాగించింది. మిగిలిన సమయాన్ని వైద్య వృత్తికి కేటాయించేది. ఇలా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసింది.
☛ IAS Officer Success Story : ఈ మైండ్ సెట్‌తోనే.. ఐఏఎస్.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..
☛ Supraja,DSP : వీరిని లెక్కపెట్టకుండా చదివా..గ్రూప్-1 ఉద్యోగం కొట్టా..
☛ IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మరణం.. మరో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివరికి..
తర్వాత సివిల్స్ మెయిన్స్ పరీక్షకు సిద్ధమయ్యే సమయంలో.. తన చదువుపై పూర్తిగా దృష్టి పెట్టాలని భావించి.. కొద్ది రోజుల పాటు వైద్య వృత్తిని వదిలివేసింది. సివిల్స్ పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఐఏఎస్ అధికారి కావాలనే ఆశయంతో చాలా కష్టపడింది. చివరికి, తన కృషి ఫలించి.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షలో రెండో ర్యాంకు సాధించింది. చిన్నప్పటి నుంచి ఉన్న తన ఐఏఎస్ కలను సాకారం చేసుకుంది.
నా భర్త కూడా ఐఏఎస్..
ఇకపోతే.. తను 2022లో ఐఏఎస్ అయిన శ్రీరామ్ వెంకట్‌రామన్‌ను పెళ్లి చేసుకుంది. తన భర్త కూడా యూపీఎస్సీ సివిల్స్ 2012లో రెండో ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యారు. ప్రస్తుతం శ్రీరామ్ కేరళ మెడిక్ సర్వీసెస్ కార్పొరేషన్ కు ఎండీ. అయితే ఈమె వివాహజీవితం కొద్దిగా వివాదాస్పదంగా మారింది. ఎంత కష్టమైనా మనం అనుకుంటే చేయలేనిది ఏదీ లేదని నిరూపించింది రేణు రాజ్. డాక్టర్‌గా ఎదుగుతూనే ఐఏఎస్‌గా కూడా ఎదిగింది. రెండు అతి కష్టమైన వృత్తుల్లోకి వెళ్లి.. ఘన విజయం సాధించి అందరి మన్ననలు పొందింది.
☛ IAS Achievement : ఎటువంటి శిక్షణ లేకుండానే.. రెండో ప్రయత్నంలోనే ఐఏఎస్ కొట్టానిలా..