Dikshita Joshi IAS Officer Success Story : ఎలాంటి కోచింగ్ లేకుండానే.. సివిల్స్ కొట్టి.. ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యానిలా.. కానీ..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(UPSC) నిర్వ‌హించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో ఎలాంటి కోచింగ్ లేకుండానే.. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన దీక్షిత జోషి 2022లో జాతీయ స్థాయిలో 58వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అధికారిగా ఎంపిక‌య్యారు.
Dikshita Joshi

వాస్తవానికి UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. 

ఈ సివిల్స్‌ పోటీ పరీక్షలో విజ‌యం కోసం అనేక మంది ఎంతో కష్టపడతారు. సివిల్స్ రాయాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షలో స‌క్సెస్ కావ‌డానికి సంవత్సరాలు పడుతుంది. కానీ దీక్షిత జోషి మాత్రం ఎలాంటి కోచింగ్ లేకుండానే.. జాతీయ స్థాయిలో 58వ ర్యాంక్ సాధించి రికార్టు క్రియేట్ చేశారు. ఈ నేప‌థ్యంలో దీక్షిత జోషి స‌క్సెస్ జర్నీ మీకోసం..

☛ Abhilasha Abhinav IAS Success Story : ఖమ్మం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌.. స‌క్సెస్ స్టోరీ.. ఎక్క‌డ ప‌నిచేసిన కూడా..

కుటుంబ నేప‌థ్యం : 
దీక్షితా జోషి ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ నివాసి. దీక్షిత తండ్రి ఫార్మసిస్ట్, ఆమె తల్లి ఇంటర్ కాలేజీలో హిందీ లెక్చరర్.

ఎడ్యుకేష‌న్ : 

దీక్షితా జోషి.. ఆర్యమాన్ విక్రమ్ బిర్లా స్కూల్ నుంచి పాఠశాల విద్యను అభ్యసించారు. 12వ తరగతి ఉత్తీర్ణత(2013) సాధించారు. ఆ తర్వాత‌ జిబి పంత్ విశ్వవిద్యాలయం పంత్‌నగర్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా(2013-2017) పుచ్చుకున్నారు దీక్షితా. ఐఐటీ మండి నుంచి మాస్టర్స్ చేశారు.

☛ Durishetty Anudeep, IAS Success Story : హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌.. అన్నింట్లోనూ టాప్‌.. ఈయ‌న స‌క్సెస్ సీక్రెట్ ఇదే..!

ఇందుకే.. సివిల్స్ వైపు వ‌చ్చానిలా..

తాము నిర్దేశించుకున్న లక్షాన్ని సాధించాలనే కృషి పట్టుదల ఉంటే చాలు.. సాధించలేదని ఏదీ ఉండదు అని అనేక మంది నిరూపిస్తూనే ఉన్నారు.వాస్తవానికి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పోటీ పరీక్ష కోసం అనేక మంది ఎంతో కష్టపడతారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. దీక్షితా సివిల్స్ ప్రిపేర్ అయ్యేందుకు ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. సొంత ప్రిప‌రేష‌న్‌తోనే సివిల్స్ కొట్టింది.

చ‌ద‌వండి: 23 ఏళ్ల‌కే ఐఏఎస్‌... ఎలాంటి కోచింగ్ లేకుండానే క‌శ్మీర్ నుంచి స‌త్తాచాటిన యువ‌తి

2022లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో.. మంచి ర్యాంక్‌ సాధించిన దీక్షితా జోషి IAS అధికారిగా ఎంపికయ్యారు. మాస్టర్స్ చేస్తున్న సమయంలో దీక్షిత యూపీఎస్సీ పరీక్షలను రాయాలని నిర్ణయించుకున్నారు.

చ‌ద‌వండి: జీవితంలో ఓట‌మిని ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దు... వ‌రుస‌గా 35 సార్లు ఫెయిల్‌... చివ‌రికి ఐఏఎస్ సాధించానిలా

సివిల్స్ కొట్టాలంటే.. నా స‌ల‌హా ఇదే..

యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి దీక్షితా కొన్ని చిట్కాలు ఇచ్చారు. జీవితంలో ఓటమికి ఎప్పుడూ భయపడకూడదని అన్నారు. ఒక బ‌ల‌మైన సంక‌ల్పంతో ముందుకు వెళితే విజ‌యం మీదే అవుతుంద‌న్నారు. అలాగే యూపీఎస్సీ సివిల్స్‌ను ఛేదించడానికి ఏకాగ్రతను ఎట్టి ప‌రిస్థితుల్లో మిస్ కావద్దన్నారు. ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాల నుంచి నోట్స్ సిద్ధం చేసుకోండి.

☛ UPSC Civils Ranker Success Story : ఈ సివిల్స్ ర్యాంక‌ర్ స్టోరీ చ‌దివితే.. కళ్లు చెమర్చక త‌ప్ప‌దు.. పేజీలు కూడా తిప్పలేని పరిస్థితి నాది.. కానీ..

#Tags