UPSC IFS Final Results Declared: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో జనగామ విద్యార్థికి టాప్ ర్యాంక్
Sakshi Education

జనగామ: యూపీఎస్‌సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) ఫలితాల్లో జనగామ విద్యార్థి ఆల్ ఇండియా 135వ ర్యాంకు సాధించారు. జనగామ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బానోతు దుస్రు, అనసూయ దంపతుల కుమారుడు భరత్‌కుమార్. పదోతరగతి వరకు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివారు.
హైదరాబాద్ అమీన్‌పూర్‌లో ఇంటర్, మద్రాస్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించారు.
Happiest Country: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏదో తెలుసా?
ఐదేళ్ల తర్వాత ఈపీఎఫ్‌లో ఉద్యోగం రావడంతో ప్రస్తుతం అందులో విధులు నిర్వర్తిస్తూ.. కోచింగ్‌కు వెళ్లకుండానే ఆరేళ్ల పాటు ప్రిపేరయ్యారు. రెండ్రోరోజుల క్రితం విడుదలైన యూపీఎస్‌సీ ఫలితాల్లో భరత్‌కుమార్‌కు టాప్ ర్యాంక్ రావడంతో కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది.
Published date : 11 May 2024 03:06PM