UPSC CSE Results Date : యూపీఎస్సీ సీఎస్ఈ 2024 ఫలితాలు విడుదల ఎప్పుడంటే.. ఇలా చెక్ చేసుకోవాలి..

సాక్షి ఎడ్యుకేషన్: ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారుల స్థానం కోసం రాసే యూపీఎస్సీ సివిల్స్ సర్వీస్ పరీక్ష (సీఎస్ఈ) పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలను నేడు, లేదా రేపు విడుదల చేసే అవకాశాలున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ పరీక్షను మొత్తం 1,056 ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను గత సంవత్సరం.. ఫిబ్రవరి 14, 2024న విడుదల చేయగా, జూన్ 16, 2024న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. తరువాత, సెప్టెంబర్‌లో 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షను నిర్వహించగా, ఇంటర్వ్యూలను ఈ ఏడాది జనవరి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు నిర్వహించారు.
బ్రేకింగ్ న్యూస్:రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు,....ఇలా చెక్ చేసుకోండి
రోల్ నంబర్లు..
అయితే, ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను నేడు, లేదా రేపు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక, ఈ పరీక్షల ఫలితాలను అభ్యర్థులు upsc.gov.in వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు. ఈ తుది మెరిట్ జాబితాలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు రోల్ నంబర్లు కలిగి ఉంటాయి. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష (సీఎస్ఈ) రెండు అఖిల భారత సర్వీసులు, 25 కి పైగా కేంద్ర సివిల్ సర్వీసులకు అభ్యర్థులను నియమించడానికి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ప్రక్రియ కోసం కమిషన్ దాదాపు 3,000 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది.
ఇలా చెక్ చేసుకోండి..
మొదట, upsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
బ్రేకింగ్ న్యూస్: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల'.. విద్యాశాఖ మంత్రి లోకేష్ కీలక ప్రకటన
What’s New విభాగంలో లింక్‌ను చూడండి.
UPSC CSE (IAS) Result 2024 PDF కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేయండి. మీ ర్యాంక్‌ను వెతకండి.
ఈ పీడీఎఫ్‌ను ప్రింట్ తీసి పెట్టుకోండి. భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- competitive exams results
- central exams
- UPSC
- Civils Services Exam Results 2024
- Download UPSC CSE Results PDF 2024
- PDF Download for UPSC CSE Results 2024
- Union Public Service Commission
- UPSC CSE Results 2024
- UPSC Results 2024
- IAS and IPS Exams Results
- Download Process for UPSC CSE PDF
- Results 2024
- Competitive exams results 2024
- government job exams results 2024
- April 22
- results to be released soon
- UPSC CSE Results 2024 Expected Soon
- UPSC CSE Results 2024 Date
- Education News
- Sakshi Education News