Telangana New DGP Anjani Kumar Story : దీని కోస‌మే ‘ఐపీఎస్’ అయ్యా.. కానీ..

తెలంగాణ ప్ర‌భుత్వం ఇంఛార్జ్‌ డీజీపీగా అంజ‌నీకుమార్‌ను డిసెంబ‌ర్ 29వ తేదీన‌ నియామ‌కం చేసిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో అంజ‌నీకుమార్‌ చిన్న‌తనం నుంచి డీజీపీ వ‌ర‌కు ఎలాంటి క‌ష్టాల‌ను ఎదుర్కొన్నాడు. ఎలాంటి విజ‌యాలు సాధించాడు. పోలీసు ఉద్యోగం వైపు ఎందుకు రావాల‌నుకున్నాడు..? మొద‌లైన వాటిపై సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక స‌క్సెస్ స్టోరీ మీకోసం..
DGP Anjani Kumar Success Story

నువ్వానేనా అన్నట్లు.. 
‘కాలేజీ రోజుల్లో ఢిల్లీ పోలీసునే ఢీ కొట్టాం. ఆ కాస్సేపు నువ్వానేనా అన్నట్లు పోరాడాం. ఢిల్లీ యూనివర్శిటీ ఆధీనంలోని కేఎం కాలేజ్‌ బాస్కెట్‌ బాల్‌ టీమ్‌లో నేను ఉండగా ఢిల్లీ పోలీసు టీమ్‌పై ఆడినప్పటి మాట ఇది...’ అంటూ ఇన్‌ఛార్జ్‌ డీజీపీ అంజనీ కుమార్‌ తన జ్ఞాపకాలను పంచుకున్నారు. కాలేజీ రోజుల్లో పోలీస్‌ యూనిఫాం అంటే ఎంతో క్రేజ్‌ ఉండేదని.. ఆ క్రేజ్‌తోనే ఐపీఎస్‌ ఆఫీసరనయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. తనకు హార్స్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టమన్నారు. టీమ్‌వర్క్‌ ఉంటే ఏ పనిలోనైనా విజయం సాధ్యమని, తాను అందరినీ కలుపుకొనిపోయి శాంతిభద్రతలు పరిరక్షిస్తానని చెప్పారు.

నా ఎడ్యుకేష‌న్‌..:
బీహార్‌లోని పట్నాలోనే నా బాల్యం, స్కూలు జీవితం గడిచిపోయాయి. డిగ్రీ, పీజీ చేయడం కోసం ఢిల్లీ చేరుకున్నా. ఢిల్లీ యూనివర్శిటీతో పాటు దాని ఆధీనంలోని కాలేజీల్లో చదివా. 

స్పోర్ట్స్‌లోనూ..

స్కూలు రోజుల నుంచే నేను స్పోర్ట్స్‌ పర్సన్‌ను. అనేక స్థాయిల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నా. బాస్కెట్‌బాల్, క్రికెట్‌ టీమ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించా. ఆయా సందర్భాల్లో జరిగిన అనేక ఫంక్షన్లకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యే వారు. దీంతో వారిని దగ్గర నుంచి చూసే అవకాశం దక్కింది. అప్పట్లో నాకు పోలీసు యూనిఫాం అంటే ఎంతో క్రేజ్‌. ఆగస్టు 15, జనవరి 26న జరిగే పెరేడ్స్‌ ఎంతో స్ఫూర్తి నింపాయి. అప్పట్లోనే పోలీసు అవ్వాలని నిర్ణయించుకున్నా.

Telangana New DGP : తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా అంజ‌నీకుమార్‌.. డీజీపీగా నియ‌మించాలంటే ఉండాల్సిన అర్హ‌త‌లు ఇవే..?

చిన్నప్పటి నుంచీ జాతీయ జెండాను చూసినా, జాతీయ గీతం విన్నా బయటకు చెప్పలేని పాజిటివ్‌ భావన కలిగేది. ఢిల్లీ యూనివర్శిటీ ఆధీనంలోని కేఎం కాలేజ్‌లో చదివే రోజుల్లో బాస్కెట్‌బాల్‌ టీమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించా. అప్పట్లో మా జట్టు ఢిల్లీ పోలీసు జట్టుతో హోరాహోరా పోరాడి గెలిచింది. ఇలా పోలీసు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ జట్లతోనూ ఆట ఆడాం. 1990లో ఐపీఎస్‌కు ఎంపికై ఆంధ్రప్రదేశ్‌కు అలాట్‌ అయ్యా. జనగాం ఏఎస్పీగా కెరియర్‌ ప్రారంభించా. ప్రస్తుతం యూనిఫాం అన్నది ఓ బాధ్యతగా మారిపోయింది.

IPS Success Story : ఇంట్లో చెప్ప‌కుండా.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..

ఖాళీ దొరికినప్పుడల్లా..
నగరంలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో ఐపీఎస్‌ శిక్షణ తీసుకునే రోజుల్లో గుర్రపు స్వారీ, ఈతపై ఆసక్తి ఎక్కువగా ఉంటోంది. ఈ రెండు అంశాల్లోనూ మంచి ప్రతిభ కనబరుస్తూ వచ్చా. అధికారిగా పోస్టింగ్స్‌ తీసుకున్న తర్వాత కూడా ఖాళీ దొరికినప్పుడల్లా క్రీడాకారుడిగా, హార్స్‌ రైడర్‌గా మారిపోయేవాడిని. నగర పోలీసు విభాగంలో అదనపు సీపీగా పని చేసిన రోజుల్లోనూ దాన్ని కొనసాగించా. అయితే అదనపు డీజీపీగా (శాంతిభద్రతలు) బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటికి పూర్తిగా దూరమయ్యా. ఆ ఆటలు ఆడే అవకాశమే దక్కలేదు.

Ramesh IPS Success Story : జీవితంలో కష్టాలు రావడం కూడా అదృష్టమే.. ఈ ఐపీఎస్ స్టోరీ చ‌దివితే..మీకే తెలుస్తుంది..

డీజీపీ మహేందర్ రెడ్డి స్థానంలో..?

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబ‌ర్‌ 31తో ముగియనుంది. దీంతో ఆస్థానంలో ఎవరు డీజీపీగా నియమితులవుతారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అయితే తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతానికి తెలంగాణ ఇంఛార్జ్‌ డీజీపీగా అంజ‌నీకుమార్ నియామ‌కం చేసింది. ప్రస్తుత నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఉమేష్ షరీఫ్, అంజనీ కుమార్, రవి గుప్తా వంటి సీనియర్ ఆఫీసర్ల పేర్లు తెరపైకి వచ్చినా.. తాత్కాలిక ప్రాతిపదికన అర్హులైన వారితో అంజ‌నీకుమార్ నియమించారు.

IPS Success Story : న‌న్ను విమర్శించిన‌ వారే.. ఇప్పుడు త‌ల‌దించుకునేలా చేశానిలా..

తాత్కాలిక డీజీపీనా.. లేదా..?
ఈ బిల్లు ప్రకారమే ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి నియామకం జరిగింది. అనురాగ్ శర్మ పదవీ విరమణ తర్వాత.. మెుదట మహేందర్ రెడ్డి ఇంఛార్జ్ డీజీపీగా ఆ తర్వాత పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. ఇప్పుడూ అదే విధానం అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా అంజనీకుమార్‌ వైపు ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అయితే ఆయన ఏపీ క్యాడర్‌కు చెందిన అధికారి. న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలంగాణలో కొనసాగుతున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ఏపీ కేడర్‌కు చెందిన వ్యక్తే. సోమేశ్‌కుమార్‌ క్యాడర్‌కు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. వచ్చే నెలలో దీనిపై తీర్పు వెలువడవచ్చని అధికారులు భావిస్తున్నారు. సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాలని తీర్పు వస్తే ఆ ప్రభావం అంజనీ కుమార్‌పై పడనుంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక డీజీపీని నియమించి ప్రభుత్వం...ఈ మేరకు ఉత్తర్వులను విడుద‌ల చేసింది.

అంజనీ కుమార్‌ నిర్వర్తించిన పోస్టులు ఇవే.. 

➤ జనగామ ఏఎస్పీగా పనిచేశారు.
➤ కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ చీఫ్‌గా పనిచేశారు.
➤ ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ చీఫ్‌గా పనిచేశారు.
➤ నిజామాబాద్ డీఐజీగా పనిచేశారు
➤ వరంగల్ ఐజీగా పనిచేశారు.
➤ హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. 
➤ తెలంగాణ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా చేశారు.
➤ 2018 మార్చి 12న హైదరాబాద్ కమిషనర్‌గా చేరారు.
➤ 2021 డిసెంబరు 25న ఏసీబీగా డీజీగా నియమితులయ్యారు.
➤  2022 డిసెంబ‌ర్ 29న తెలంగాణ ఇన్‌చార్జ్‌ డీజీపీగా నియమితులయ్యారు.

☛ IPS Success Story : ఈ అసంతృప్తితోనే.. ఐపీఎస్ సాధించా.. కానీ..

☛ IPS Success Story : ఇంట్లో చెప్ప‌కుండా.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..

 Success Story : ఎలాంటి ఒత్తిడి లేకుండా సివిల్స్ కొట్టానిలా.. నా రికార్డును నేనే..

#Tags