Sheshadrini Reddy IPS Success Story : ఆన్‌లైన్‌లో స్ట‌డీమెటీరియల్‌ ఫాలో అవుతూ.. ఐపీఎస్ సాధించానిలా.. కానీ

ఏ తల్లిదండ్రులైన త‌మ బిడ్డ‌ల‌ను ఉన్న‌త స్థానంలో చూడాల‌ని ఆశప‌డుతుంటారు. అలాగే ఈ బిడ్డ త‌మ త‌ల్లిదండ్రుల ఆశ‌యాల‌కు అనుగుణంగా క‌ష్ట‌ప‌డి చ‌దివి.. మహోన్నత విజయంతో ఐపీఎస్ ఆఫీస‌ర్ అయ్యారు. ఈ యువ ఐపీఎస్‌ అధికారే శేషాద్రిని రెడ్డి.
Sheshadrini Reddy IPS Success Story

సమాజంలో అత్యున్నతమైన ఇండియన్ పోలీస్‌ సర్వీస్‌కు ఎంపిక కావడమే కాదు.. ట్రైనింగ్‌లోనూ త‌ను సివంగిలా పురుషులతో కలబడి నిలబడ్డారు ఈమె.

☛ Success Story : నా జీవితాన్ని ఈ కోణంలో చూశా.. యూపీఎస్సీ సివిల్స్‌లో ర్యాంక్ కొట్టానిలా..
సమాజంలో సివిల్‌ సర్వెంట్లకు ఉన్నతమైన గౌరవం ఉంటుందని తెలుసుకున్నా. ఎప్పటికై నా కిరణ్‌బేడీలా పోలీస్‌ అధికారిని కావాలనుకున్నా. నాన్న ప్రోత్సాహంతో కల నెరవేర్చుకున్నా. యువత ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని చేరుకునేందుకు శ్రమించాలి’ అని యువ ఐపీఎస్‌ అధికారి శేషాద్రినిరెడ్డి చెప్పారు. తెలంగాణ కేడర్‌కే కేటాయించబడిన ఆమె ప్రస్తుతం నల్లగొండలోని ఎస్పీ కార్యాలయంలో ప్రొబేషనరీ విధుల్లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో శేషాద్రినిరెడ్డి తన సక్సెస్‌పై.. ‘సాక్షి’ తో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
మాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం. నాన్న సురకంటి సుధాకర్‌రెడ్డి సివిల్‌ కాంట్రాక్టర్‌. తమ్ముడి పేరు శివదుర్గారెడ్డి. వరంగల్‌లోని ఎన్‌ఐటీ(నిట్‌)లో గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నాడు. అమ్మా, నాన్న, తమ్ముడు మా కుటుంబం.

☛ UPSC Civils Ranker Success Story : వీటిని త్యాగం చేశా.. యూపీఎస్సీ సివిల్స్‌లో ర్యాంక్ కొట్టా..

ఎడ్యుకేష‌న్ : 
నేను పుట్టింది, చదువుకుంది అంతా హైదరాబాద్‌లోనే. హైదరాబాద్‌ ఐఐటీలో బీటెక్‌ పూర్తిచేశాను. నాన్న ప్రోత్సాహంతో సివిల్స్‌పై దృష్టిపెట్టాను. సివిల్‌ సర్వీసెస్‌ ఆఫీసర్‌గా ప్రజలకు ఎంతో సేవ చేసే అవకాశం ఉంటుందని, వాళ్లకు సమాజంలో ఉన్నతమైన గౌరవం ఉంటుందని తెలుసుకుని అటువైపు అడుగులు వేశాను.

సొంత ప్రిప‌రేష‌న్‌తోనే..

నా ఇంజనీరింగ్‌ పూర్తయిన వెంటనే సివిల్స్‌ ప్రిపరేషన్‌ మొదలుపెట్టాను. కోచింగ్‌కు వెళ్లకుండానే.. ఆన్‌లైన్‌ మెటీరియల్‌ చదివాను. మోడల్‌ పేపర్‌లను ఫాలో అయ్యాను. సీనియర్ల గైడెన్స్‌, మాక్‌ ఇంటర్వ్యూల ద్వారా అవగాహన పెంచుకున్నా. 

☛ Sadaf Choudhary IAS Success Story : ఆ కట్టుబాట్లను చెరిపేసి.. అనుకున్న‌ట్టే క‌లెక్ట‌ర్ ఉద్యోగం సాధించానిలా.. చివ‌రికి..

నేను ఇంజనీరింగ్‌ చదివినప్పటికీ సివిల్స్‌లో ఆప్షనల్‌గా తెలుగు లిటరేచర్‌ తీసుకున్నా. తెలుగుపై అనేక సాహిత్య, సాంస్కృతిక, చరిత్ర పుస్తకాలను చదివాను. 2019లో మొదటిసారిగా సివిల్స్‌ పరీక్ష రాశాను. అప్పుడు ఎంపిక కాలేదు. ఆ తర్వాత 2020 సంవత్సరంలో రెండో ప్రయత్నంలో (401) ర్యాంకు వచ్చింది. ఐపీఎస్‌కు ఎంపికయ్యాను.

ఆమే నాకు స్ఫూర్తి..

మా నాన్న ఎం.కాం చదివారు. అప్పట్లో గ్రూప్‌–1 పరీక్ష రాశారు. ఇంటర్వ్యూలో సెలక్ట్‌ కాలేదు. మా ద్వారా ఆయన కల నెర్చుకోవాలనుకున్నారు. చిన్నప్పటి నుంచే ఆ దిశగా నన్ను ప్రోత్సహించారు. ఐపీఎస్‌ కావాలని చెప్పేవారు. దేశంలోని ఉత్తమ పోలీస్‌ అధికారుల గురించి వివరించే వారు. కిరణ్‌బేడీ గురించి తెలుసుకున్నా. ఆమే నాకు స్ఫూర్తి. ఎప్పటికై నా అలా కావాలనుకున్నా. నేను ఐపీఎస్‌ సాధించి నా కల నెర్చుకోవడంతో పాటు నాన్న కలను కూడా నెరవేర్చాను.

☛ IAS Officer Success Story : ఫ‌స్ట్ అటెంప్ట్‌లోనే ఐఏఎస్ .. ప్ర‌స‌వించిన 14 రోజుల‌కే పసిబిడ్డతో.. ఆఫీస్‌కు..

చీర ఎందుకు కట్టుకోలేదని..

సివిల్స్‌ ఇంటర్వ్యూ రోజున మహిళలంతా చీరకట్టులో వచ్చారు. నేను ఒక్కదాన్నే చుడీదార్‌లో వెళ్లాను. చీర ఎందుకు కట్టుకోలేదని బోర్డు సభ్యులు అడిగారు. నాకు చీర కంఫర్ట్‌ కాదని చెప్పాను. ఇంటర్వ్యూలో తడబడవద్దు. మనం ఏది చెప్పాలనుకుంటే అది చెప్పేయాలి. కమ్యూనికేషన్‌ కమాండ్‌ ఉండాలి. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. నా సబ్జెక్టు తెలుగు కాబట్టి.. తెలుగు చరిత్రపై ఎక్కువ ప్రశ్నలు అడిగారు. కరెంట్‌ ఎఫైర్స్‌ కూడా అడిగారు.

Success Story : సొంతూరికీ వెళ్ల‌కుండా చ‌దివా.. అనుకున్న ప్ర‌భుత్వ ఉద్యోగం కొట్టానిలా..

వేంకటేశ్వరస్వామి పేరు వచ్చేలా..
అమ్మానాన్నకి భక్తి ఎక్కువ. అందుకు నాకు వేంకటేశ్వరస్వామి పేరు వచ్చేలా శేషాద్రినిరెడ్డి అని పెట్టారు. తమ్ముడి పేరు శివదుర్గారెడ్డి. వరంగల్‌లోని ఎన్‌ఐటీ(నిట్‌)లో గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నాడు.

ఇదే తేడా.. కానీ

ఐపీఎస్‌ శిక్షణలో నేర్చుకున్నదానికి, ప్రాక్టికల్‌గా చూస్తున్నదానికి ఎంతో తేడా ఉంది. వృత్తిపరమైన అంశాలపై ఎస్పీ అపూర్వరావు వివరంగా చెబుతున్నారు. ఎస్పీ వద్ద ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నా. డ్యూటీలో చాలా వర్క్‌ చేయాల్సి ఉంటుంది. మానిటరింగ్‌ చేయాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. లా అండ్‌ ఆర్డర్‌పై కంట్రోల్‌ ఉండాలి.

➤☛ UPSC Ranker Success Story : ఈ తిరస్కరణే నేను సివిల్స్‌పై న‌డిచేలా చేశాయ్‌.. నా వైకల్యం కారణంగా..

ఒక్కసారి ఓటమిచెందితే..

యువత గోల్‌ పెట్టుకోవాలి. తాము ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలి. దాని ప్రకారం శ్రమించాలి. గోల్‌ పెట్టుకోకుండా.. తమకు ఏం కావాలో నిర్ణయించుకోకుండా ముందుకు వెళితే ప్రయోజనం ఉండదు. ఒక్కసారి ఓటమిచెందితే నిరుత్సాహపడవద్దు. విజయం మన సొంతమయ్యే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సరైన మార్గనిర్దేశనం అవసరం.

➤☛ Success Story : ఒకే క‌ల‌.. ఒకే స్టడీ మెటిరీయల్ చ‌దువుతూ.. అక్కాచెల్లెళ్లిద్దరూ ఐఏఎస్ ఉద్యోగం కొట్టారిలా..

దానిపై దృష్టిపెడతా..

ప్రస్తుతం పోలీస్‌ శాఖకు సైబర్‌ క్రైం సవాల్‌ విసురుతోంది. దీనిపట్ల సీనియర్‌ అధికారులు అమలు చేస్తున్న విధానాలు తెలుసుకుంటా. భవిష్యత్తులో మరింతగా సైబర్‌ నేరాలను ఎలా కట్టడి చేయాలన్న దానిపై దృష్టిపెడతా. ప్రజలకు పోలీసింగ్‌ మరింత చేరువ చేసేందుకు కృషిచేస్తా.

➤☛ UPSC 2021 Civils Ranker: ఈ ఆప‌రేష‌న్ వ‌ల్లే ఉద్యోగం కొల్పోయా.. నాన్న చెప్పిన ఆ మాట‌లే ర్యాంక్ కొట్టేలా చేశాయ్‌..

#Tags