IAS Success Story : నా పాత బ్యాక్‌గ్రౌండ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి.. క‌లెక్ట‌ర్ ఉద్యోగం కొట్టానిలా..

ఈ యువకుడి ఎడ్యుకేషన్ ఏమంతగా బాగాలేదు. డిగ్రీలో చాలా సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అయ్యాడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే చదువుకు స్వస్తి చెబుతారు. అయితే ఆ యువకుడు మాత్రం.. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడే ఏదో సాధించాలనే తపనతో కెరీర్ ప్లాన్ చేసుకున్నాడు.
Anurag Kumar, IAS Success Story

ఈ క్రమంలో తనపై ఏమాత్రం నమ్మకం కోల్పోలేదు. పైగా ఉన్నత‌మైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ప్రిపరేషన్‌‌ను పక్కాగా ప్లాన్ చేసుకుని అందుకు సరైన స్ట్రాటజీ అనుసరించి యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వహించే సివిల్ సర్వీస్ ప‌రీక్ష‌ల‌ను క్లియర్ చేసి.. ఐఏఎస్ సాధించి అంద‌రి చేత‌ శభాష్ అనిపించుకున్నాడు. బీహార్‌లో అత‌ను ఇప్పుడు కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు కూడా. ఈత‌ని పేరే కుమార్ అనురాగ్ ఐఏఎస్‌. ఈ నేప‌థ్యంలో కుమార్ అనురాగ్ సక్సెస్ స్టోరీ మీకోసం..

IPS Success Story : న‌న్ను విమర్శించిన‌ వారే.. ఇప్పుడు త‌ల‌దించుకునేలా చేశానిలా..

కుటుంబ నేప‌థ్యం :
కుమార్ అనురాగ్.. బీహార్‌లోని కతిహార్ ప్రాంతానికి చెందినవాడు. 

ఎడ్యుకేష‌న్‌: 

అనురాగ్.. 8వ తరగతి వరకు హిందీ మీడియంలో చదువుకొన్నాడు. ఆ తరువాత మీడియం మారడంతో సబ్జెక్ట్‌ను అర్థం చేసుకోవడంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. దీంతో 10, 12వ తరగతి పాస్ కావడానికి ఎంతో చెమటోడ్చాల్సి వచ్చింది. ఉన్నత చదువుల కోసం అనురాగ్ ఢిల్లీకి వెళ్లాడు. ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేయడానికి ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో చేరాడు. అయితే గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు అనురాగ్ చాలా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో చదువు మానేసి సొంత ఊరికి వెళ్లాలనుకున్నాడు. అయితే భవిష్యత్తు కోసం కష్టపడి చదవాలని, మనసులోని ఆలోచన విరమించుకున్నాడు అనురాగ్. ఇలా చాలా కష్టపడి 2014లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

IAS Officer Success Story : నాన్న నిర్ల‌క్ష్యం.. అన్న త్యాగం.. ఇవే న‌న్ను ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌.. కానీ

నానా తంటాలు ప‌డుతూ.. పీజీని.. 

తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీజీలో చేరాడు. అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి కూడా అనురాగ్ నానా తంటాలు పడ్డాడు. కానీ తనపై నమ్మకం ఎప్పటికీ కోల్పోలేదు. ఈ క్రమంలోనే 2016లో పీజీ పూర్తిచేసి, యూపీఎస్సీ పరీక్షకు ప్రిపరేషన్ మొదలు పెట్టాడు.

Success Story : ఈ జ‌వాన్‌.. చివ‌రికి ఐఏఎస్ కొట్టాడిలా.. నా ఆరాటం..పోరాటం ఇదే..

సివిల్స్ మొదటి ప్రయత్నంలో..

అనురాగ్.. 2017లో మొదటిసారి సివిల్స్ పరీక్షలు రాశాడు. అయితే మొదటి ప్రయత్నంలో అనుకున్నంత ర్యాంక్ సాధించ‌లేకపోయాడు. రెండో ప్రయత్నంలో మాత్రం పక్కా ప్రిపరేషన్‌ ప్లాన్ వేసుకున్నాడు. అందుకు తగ్గట్టు ఒక్క ప్ర‌క్క ప్ర‌ణాళిక‌ను అనుసరించాడు. 2018లో రాసిన యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ఈసారి జాతీయ స్థాయిలో 48 ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు.

Inspiring Success Story : ప్రసూతి సెలవుల్లో సివిల్స్‌కు ప్రిపేర‌య్యా.. ఐపీఎస్ సాధించానిలా.. కానీ..

పాత ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి.. కొత్త‌గా

ఈ సంద‌ర్భంగా అనురాగ్.. ఫెయిల్యూర్ నుంచి ఎలా సక్సెస్ అయ్యాననే విషయంపై మాట్లాడారు. సరైన ప్రణాళిక, వ్యూహం కారణంగానే సివిల్ సర్వీసెస్ పరీక్షలో పాసయ్యాను. పాత ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ వదిలిపెట్టి, మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాను. సివిల్స్ పరీక్షలో ఏ మాత్రం తొందరపాటు పడలేదు. ప్రతి అంశాన్ని చాలా లోతుగా అధ్యయనం చేశాను. కఠోర శ్రమతో పాటు మెరుగైన వ్యూహంతో ప్రిపరేషన్ కావడం వల్ల సక్సెస్ అయ్యాన‌ని అనురాగ్ తెలిపారు. చదువులో ఎన్నో ఎత్తుపల్లాలు అనుభవించిన అనురాగ్ జీతంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించిన నలుగురికి అదర్శంగా నిలిచాడు. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో కలెక్టర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు.
Success Story : నలుగురు తోబుట్టువుల్లో.. ముగ్గురు ఐఏఎస్‌లు.. ఒక ఐపీఎస్‌.. వీరి స‌క్సెస్ సీక్రెట్ మాత్రం ఇదే..

#Tags