సివిల్స్ స్వప్నం.. ఇలా చేస్తే సాకారం!
సివిల్స్‌లో విజయం యువతకు ఒక స్వప్నం. సివిల్స్ లక్ష్యం చేరడానికి కొంతమంది ఏళ్ల తరబడి ఓ తపస్సులా, యజ్ఞంలా ప్రిపరేషన్ సాగిస్తుంటారు. అయితే క్రమబద్ధమైన విధానం, సరైన వ్యూహంతో అడుగులు వేస్తే సివిల్స్ కల సాకారం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సివిల్ సర్వీసెస్-2016 నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై నిపుణుల సలహాలు, సూచనలు..
అపోహలొద్దు!
‘సివిల్స్‌లో విజయం సాధించాలంటే ఏళ్ల తరబడి కృషి చేయాలి. సివిల్స్ సిలబస్, ప్రశ్నపత్రం ఇంజనీరింగ్, మ్యాథ్స్ నేపథ్యం వారికి; మెట్రో నగరాల్లో, ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారికి అనుకూలం’ లాంటి అభిప్రాయాలు అభ్యర్థుల్లో నెలకొంటున్నాయి. ఇవన్నీ అపోహలేనని, దృఢ సంకల్పంతో శ్రమిస్తే.. సగటు విద్యార్థి సైతం సివిల్స్‌లో విజయం సొంతం చేసుకోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం.
బేసిక్స్‌పై పట్టు
సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలనుకునేవారు రెండంచెలుగా ఉండే రాత పరీక్షలో (ప్రిలిమినరీ, మెయిన్స్) రాణించాలి. ఇందుకోసం బేసిక్ కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఔపోసన పట్టాలి. ముందుగా సిలబస్‌లోని అంశాలను క్షుణ్నంగా పరిశీలించి పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించాలి. సిలబస్‌లో తమకు అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్న అంశాలతో ఓ జాబితా రూపొందించుకోవాలి. ప్రతికూల అంశాలుగా భావించిన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సిలబస్ పరిశీలించిన తర్వాత గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. కనీసం గడిచిన నాలుగేళ్ల పేపర్లను పరిశీలిస్తే ఆయా అంశాల వారీగా లభిస్తున్న వెయిటేజీపై అవగాహన వస్తుంది.
అసలు కసరత్తు ప్రారంభం
పరీక్ష విధానం, సిలబస్ వెయిటేజీలపై అవగాహన వచ్చాక ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. ప్రిపరేషన్ సమయంలో సమకాలీన అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగాలి. జీవావరణం, పర్యావరణం, కళలు - సంస్కృతి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇటీవల నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షల్లో ఈ అంశాలపై ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి.
ప్రిలిమ్స్ + మెయిన్స్
ప్రిలిమ్స్ సిలబస్‌లో పేర్కొన్న అంశాల్లో అధిక శాతం మెయిన్స్‌లోనూ ఉంటున్నాయి. కాబట్టి ఒకేసారి ప్రిలిమ్స్, మెయిన్స్‌కు సన్నద్ధమయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇందుకోసం డిస్క్రిప్టివ్ అప్రోచ్ విత్ ఆబ్జెక్టివ్ ఓరియెంటేషన్ విధానాన్ని అనుసరించాలి. ఒక అంశానికి సంబంధించిన సమాచారాన్ని విభిన్న కోణాల్లో విశ్లేషిస్తూ.. ముఖ్యమైన అంశాలను షార్ట్‌నోట్స్‌గా పొందుపర్చుకుంటే ప్రిలిమ్స్‌కు కూడా ఉపయోగపడుతుంది. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్ ఎగ్జామ్‌కు తక్కువ వ్యవధి ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ ఫలితం ఆధారంగా మెయిన్స్‌కు సన్నద్ధం కావచ్చనే భావన సరికాదు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది గ్రూప్-1 నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. కాబట్టి సివిల్స్-2016కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు గ్రూప్-1 పరీక్షతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. సివిల్స్, గ్రూప్-1లో ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీలు కామన్‌గా ఉంటాయి.
సబ్జెక్ట్ .. సమకాలీనం
ఒక అంశాన్ని చదువుతున్నప్పుడే దానికి సంబంధించిన సమకాలీన పరిణామాలను అన్వయించుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఇటీవల కాలంలో అడుగుతున్న కొన్ని ప్రశ్నలు సమకాలీన అంశాలకు సంబంధించినవై ఉంటూనే.. వాటి నేపథ్యం తెలపాల్సిన ఆవశ్యకతను పెంపొందిస్తున్నాయి. ముఖ్యంగా జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ప్రశ్నల్లో ఈ శైలికి ప్రాధాన్యం పెరుగుతోంది.
పేపర్-2 ఆందోళన లేకుండా
ప్రిలిమ్స్ పేపర్-2 (సీశాట్) విషయంలో మాతృభాషలో చదివినవారు, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. పేపర్-2కు సన్నద్ధమవ్వడం కోసం పదో తరగతి, +2 స్థాయిలో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్ అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. బేసిక్ న్యూమరసీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్‌లో రాణించేలా ప్రిపరేషన్ సాగించాలి. ఆంగ్ల దినపత్రికల్లో ప్రచురితమయ్యే వ్యాసాలు చదవడం వల్ల రీడింగ్ కాంప్రహెన్షన్ విషయంలో ఉపయుక్తంగా ఉంటుంది.
అంతర్జాతీయ అంశాలపై దృష్టి
ప్రిలిమ్స్‌లో విజయం కోసం అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. గడచిన సంవత్సర కాలంలో భారత్ ఇతర దేశాలతో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, అందుకు అనుగుణంగా చేపడుతున్న చర్యలపై దృష్టి పెట్టాలి.
ప్రశ్నార్హం.. గుర్తించే నైపుణ్యం
ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించే నైపుణ్యం చాలా కీలకం. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ విషయంలో ఈ నైపుణ్యం అలవర్చుకోవాలి. ఒక సంఘటనకు సంబంధించి తేదీలు, ప్రదేశాలకు ప్రాధాన్యం ఇవ్వడం కంటే ఆ సంఘటన లేదా సదస్సులో చేసిన తీర్మానాలు, వ్యక్తమైన అభిప్రాయాలు, ఉద్దేశాలకు ప్రాధాన్యమివ్వాలి.
ఆప్షనల్ ఎంపికలో ముందుగానే అవగాహన
మెయిన్ ఎగ్జామినేషన్‌లో రెండు పేపర్లుగా ఉండే ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంపిక విషయంలో ముందుగానే అవగాహనకు రావాలి. ఆసక్తి ఉన్న సబ్జెక్ట్‌లకు ప్రాధాన్యమిస్తూనే.. మెటీరియల్, గెడైన్స్ సదుపాయాల లభ్యతలకు అనుగుణంగా వ్యవహరించాలి. స్కోరింగ్, నాన్-స్కోరింగ్ అనే విధానం ఏ సబ్జెక్ట్‌కు ఉండదు. మార్కుల కేటాయింపు పరంగా యూపీఎస్సీ అనుసరిస్తున్న స్కేలింగ్ విధానమే ఇందుకు కారణం. అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా క్రేజీ ఆప్షనల్స్‌గా పేరొందిన ఆంత్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, లిటరేచర్ లాంటి కొన్ని సబ్జెక్ట్‌లనే ఎంపిక చేసుకోవడానికి కారణం మెటీరియల్ లభ్యత, సిలబస్‌ను అవగతం చేసుకోవడంలో ఉన్న సులభశైలులే.
టైమ్ మేనేజ్‌మెంట్
సివిల్స్ సక్సెస్ ఫార్ములాలో టైం మేనేజ్‌మెంట్ ఎంతో కీలకమైంది. ప్రిపరేషన్‌కు రోజూ కనీసం ఎనిమిది గంటలు కేటాయించాలి. జూన్ చివరి నాటికి ప్రిలిమ్స్ + మెయిన్స్ ప్రిపరేషన్ పూర్తి చేయాలి. జూలై నుంచి ప్రిలిమ్స్ పరీక్ష వరకు పూర్తిగా రివిజన్‌కు కేటాయించాలి. ప్రిలిమ్స్ జరిగిన మరుసటి రోజు నుంచే మెయిన్స్ ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి.
సివిల్స్ 2014 యూపీఎస్సీ నిర్దేశిత కటాఫ్ వివరాలు
సివిల్స్-2016 షెడ్యూల్
బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
గరిష్ట వయో పరిమితి: నోటిఫికేషన్‌లో నిర్దేశించిన సమయానికి 32 సంవత్సరాలు.
ఎంపిక ప్రక్రియ:
సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. అవి..
ఖాళీల ఆధారంగా 1:1.2 లేదా 1.3 నిష్పత్తిలో పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ-275 మార్కులు)కు ఎంపిక చేస్తారు.
రిఫరెన్స్ బుక్స్

స్టేజ్ | జనరల్ | ఓబీసీ | ఎస్సీ | ఎస్టీ |
ప్రిలిమినరీ | 205 | 204 | 182 | 174 |
మెయిన్ | 678 | 631 | 631 | 619 |
ఇంటర్వ్యూ | 211 | 213 | 199 | 192 |
మెయిన్+ఇంటర్వ్యూ | 889 | 844 | 830 | 811 |
- సివిల్స్ 2014 ఫస్ట్ ర్యాంకర్ మార్కులు:
మెయిన్: 920; ఇంటర్వ్యూ: 162; మొత్తం: 1082
- సివిల్స్ 2014 లాస్ట్ ర్యాంకర్ మార్కులు:
మెయిన్: 567; ఇంటర్వ్యూ: 146; మొత్తం: 713
ప్రిలిమ్స్ పేపర్-1 (జనరల్ స్టడీస్) | |
విభాగం | ప్రశ్నలు |
హిస్టరీ | 12 |
ఆర్ట్స్ అండ్ కల్చర్ | 2 |
జాగ్రఫీ | 14 |
పాలిటీ | 13 |
ఎకానమీ | 13 |
ఎన్విరాన్‌మెంట్ | 10 |
ఎస్ అండ్ టీ | 7 |
కరెంట్ అఫైర్స్ అండ్ జీకే | 29 |
పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్) | |
విభాగం | ప్రశ్నలు |
కాంప్రహెన్షన్ | 30 |
బేసిక్ న్యూమరసీ అనలిటికల్ ఎబిలిటీ | 25 |
జనరల్ మెంటల్ ఎబిలిటీ | 25 |
సివిల్స్-2016 షెడ్యూల్
- నోటిఫికేషన్ తేది: ఏప్రిల్ 23
- దరఖాస్తు చివరి తేది: మే 20
- ప్రిలిమ్స్ పరీక్ష తేది: ఆగస్టు 7
- మెయిన్స్ పరీక్షలు: డిసెంబర్ 3, 2016 నుంచి అయిదు రోజుల పాటు.
బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
గరిష్ట వయో పరిమితి: నోటిఫికేషన్‌లో నిర్దేశించిన సమయానికి 32 సంవత్సరాలు.
ఎంపిక ప్రక్రియ:
సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. అవి..
- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం)
- మెయిన్ ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ విధానం)
- పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ
- పేపర్-1: జనరల్ స్టడీస్ - 200 మార్కులు
- పేపర్-2: ఆప్టిట్యూడ్ టెస్ట్ - 200 మార్కులు
- పేపర్-1: జనరల్ ఎస్సే
- పేపర్-2: జనరల్ స్టడీస్-1 (ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ సొసైటీ)
- పేపర్-3: జనరల్ స్టడీస్-2 (గవర్నెన్స్, కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్)
- పేపర్-4: జనరల్ స్టడీస్-3 (టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్‌మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్)
- పేపర్-5: జనరల్ స్టడీస్-4 (ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్)
- పేపర్-6: ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1
- పేపర్-7: ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-2
ఖాళీల ఆధారంగా 1:1.2 లేదా 1.3 నిష్పత్తిలో పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ-275 మార్కులు)కు ఎంపిక చేస్తారు.
రిఫరెన్స్ బుక్స్
- మోడ్రన్ ఇండియన్ హిస్టరీ - బిపిన్ చంద్ర
- ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ - బిపిన్ చంద్ర
- ఇండియా కల్చర్ - స్పెక్ట్రమ్
- ఇండియన్ జాగ్రఫీ - మాజిద్ హుస్సేన్
- ఇండియన్ పాలిటీ - లక్ష్మీ కాంత్
- ఇండియన్ ఎకానమీ - రమేశ్ సింగ్
- ఇండియా ఇయర్ బుక్ ఎకనామిక్ సర్వే
- అనలిటికల్ రీజనింగ్ - ఎం.కె.పాండే
- వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్.అగర్వాల్
త్వరగా మొదలుపెట్టాలి అభ్యర్థులు ఆధునిక భారతదేశ చరిత్రపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రిపరేషన్ సాగించాలి. సమకాలీన అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ వాటిని సబ్జెక్ట్ అంశాలతో బేరీజు వేసుకునే నైపుణ్యం సాధించాలి. కోచింగ్ తీసుకుంటేనే విజయం సాధ్యమనే అపోహ వీడాలి. తొలిసారి పరీక్ష రాసేవారు మే నుంచి పూర్తిస్థాయిలో సివిల్స్‌కు సమయం కేటాయించగలమని భావిస్తేనే అందుకు ఉపక్రమించండి. మేలో పరీక్షలు పూర్తయి.. జూన్ నుంచి సమయం లభించే అభ్యర్థులు సివిల్స్ ఆలోచనను వచ్చే ఏడాదికి వాయిదా వేసుకోవడం మంచిది. - శ్రీరంగం శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ |
ఈసారి మార్పులు లేకుండానే సివిల్ సర్వీసెస్ - 2016 పరీక్ష విధానంలో మార్పులు జరిగే అవకాశం లేదు. మార్పులు చేసే తరుణంలో యూపీఎస్సీ ఒక ఏడాది ముందుగానే అభ్యర్థులను సిద్ధం చేస్తుంది. కానీ ఇప్పటిదాకా ఇలాంటి సమాచారం లేదు కాబట్టి అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి. ప్రధానంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు, భారత అధ్యక్ష ఎన్నికల మధ్య వ్యత్యాసాలు, బ్రిక్స్ సదస్సు, తీవ్రవాదం తదితర అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. - వి.గోపాల కృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడెమీ |
నిర్ణయాత్మక నైపుణ్యం నిర్ణయాత్మక సామర్థ్యం పెంచుకునేలా అభ్యర్థులు ప్రిపరేషన్ సాగించాలి. పేపర్-2లో రాణించేందుకు నిర్ణయాత్మక సామర్థ్యం ఎంతో కీలకం. కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా.. సందర్భానికి అనుగుణంగా స్పందించడం ఎలా? ఒక అధికారిగా సమాజానికి ఉపయోగపడేలా నిర్ణయం తీసుకోవడమెలా? లాంటి విషయాలను తెలుసుకోవాలి. - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ |
#Tags