Engineering Courses: బీటెక్‌లోని వివిధ కోర్సుల విద్యార్థులు నేర్చుకోవాల్సిన సర్టిఫికేట్ కోర్సుల ఇవే..!
వీటితోపాటు రోబోటిక్స్, వీఎల్‌ఎస్‌ఐ, నానో టెక్నాలజీ విభాగాల్లో సర్టిఫికేషన్ కోర్సు లు పూర్తి చేయడం ద్వారా జాబ్ మార్కెట్లో ముందుండొచ్చు. ఈసీఈ విద్యార్థులకు ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ; ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్;రోబోటిక్స్ వంటి కోర్సులు కూడా ఉపయోగపడతాయి.
ఈఈఈ.. ఎవర్‌గ్రీన్
కోర్ బ్రాంచ్‌ల్లో ఎవర్ గ్రీన్‌గా పేరు పొందింది.. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్.(ఈఈఈ). మనం నిత్యం వాడే ఎలక్ట్రిక్ బల్బ్‌ల తయారీ మొదలు సోలార్ పవర్ ప్లాంట్స్ వరకూ.. అనేక సంస్థల్లో కొలువులను ఖాయం చేసే బ్రాంచ్ ఇది. ఈ బ్రాంచ్ విద్యార్థులు ఆధునిక అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఈఈఈ విద్యార్థులకు ఉపయోగపడే సర్టిఫికేషన్ కోర్సులు: ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పవర్ సిస్టమ్స్ అనాలిసిస్, సర్క్యూట్ అనాలిసిస్, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్ సిస్టమ్స్ ఇంజనీరింగ్. వీటితోపాటు సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్, డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్స్‌లో సర్టిఫికేషన్స్ పొందడం ద్వారా జాబ్ మార్కెట్లో ముందు నిలిచేందుకు వీలవుతుంది.
మెకానికల్.. మెరుపులు
ఎన్నో ఏళ్లుగా జాబ్ మార్కెట్‌లో నిత్యనూతనంగా నిలుస్తున్న మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ విద్యార్థులు.. తాజా అవసరాలకు అనుగుణంగా క్యాడ్, క్యామ్; రోబోటిక్స్; ఆటోమేషన్, 2–డి, 3–డి డిజైన్ ప్రింటింగ్; సిక్స్ సిగ్మా సర్టిఫికేషన్ వంటి వాటిని నేర్చుకోవడం ద్వారా కొలువులు సొంతం చేసుకోవచ్చు.
రోబోటిక్స్..
ప్రస్తుతం బ్రాంచ్‌తో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఉపయోగపడే టెక్నాలజీ.. రోబోటిక్స్. ఒక సర్వీస్ లేదా ప్రొడక్ట్ తయారీ పరంగా కార్యకలాపాలన్నీ వేగంగా,కచ్చితత్వంతో పూర్తి చేసే మెషీన్లను రూపొందిస్తున్నారు. ప్రోగ్రామింగ్ ద్వారా వాటిని నియంత్రిస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీనే.. రోబోటిక్స్. రోబోటిక్ నైపుణ్యాలుంటే కొలువులకు కొదవే లేదని చెప్పొచ్చు. సీమెన్స్, రోబోటిక్స్ ఆన్‌లైన్, సర్టిఫైడ్ ఆటోమేషన్ ప్రొఫెషనల్, రోబోటిక్స్ టెక్నీషియన్ అండ్ ఆటోమేషన్ ట్రైనింగ్, రోబో జీనియస్ అకాడమీ వంటివి సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి.
చదవండి: Civil Engineering: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..
సివిల్ ఇంజనీరింగ్..
మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణాల డిజైన్, పర్యవేక్షణ నైపుణ్యాలు అందించే బ్రాంచ్.. సివిల్ ఇంజనీరింగ్. దీనికి సంబంధించి జాబ్ మార్కెట్ కోణంలో జీఐఎస్, జీపీఎస్, 3–డి డిజైన్ టెక్నాలజీస్ ప్రధానంగా నిలుస్తున్నాయి. వీటిని నేర్చుకున్న వారికి కొలువుల సాధన సులభం అని చెప్పొచ్చు. వీటికి సంబంధించి జియో ఇన్ఫర్మాటిక్ సిస్టమ్స్ సర్టిఫికేషన్,3–డి ప్రింటింగ్, బిల్డింగ్ డిజైన్ సర్టిఫికేషన్, స్ట్రక్చరల్ అనాలిసిస్ అండ్ డిజైన్, టెక్నికల్ డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ వంటి సర్టిఫికేషన్లు ఉపయోగపడతాయి.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ)..
బ్రాంచ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే నైపుణ్యం.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ). ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ సర్టిఫికెట్ ఇన్ ఐఓటీ, సిస్కో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐబీఎం వాట్సన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, జెట్ కింగ్ ఐఓటీ సర్టిఫికేషన్ కోర్స్, సీసీఎన్‌ఏ సర్టిఫికేషన్ కోర్స్‌లు అందుబాటులోకి వచ్చాయి.
సర్టిఫికేషన్ కోర్సులు– ఉపయోగపడే పలు వెబ్‌సైట్లు
- www.autodesk.com
- www.microsoftvirtualacademy.com
- www.cisco.com
- www.redhat.com/training
- www.education.oracle.com
- www.mylearn.vmware.com
- www.robotics.org
- www.ibm.com n www.isa.org
- www.onlinerobotics.com
నైపుణ్యాలు– ముఖ్యాంశాలు
1. అన్ని రంగాల్లోనూ ఆధునిక టెక్నాలజీతో కార్యకలాపాలు.
2. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ–ఎంఎల్, ఐఓటీ, రోబోటిక్స్, బిగ్ డేటా వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాల్సిన ఆవశ్యకత.
3. ఈ నైపుణ్యాలున్న వారికి జాబ్ మార్కెట్లో డిమాండ్.
4. అందుబాటులోకి పలు సర్టిఫికేషన్ కోర్సులు.
5. అన్ని రంగాల్లోనూ అమలవుతున్న ఐఓటీ, రోబోటిక్స్ ఆధారిత కార్యకలాపాలు.
6. ఉత్పత్తి రంగాల్లో కీలక నైపుణ్యంగా మారుతున్న ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.
చదవండి: Industry 4.0 Skills: బీటెక్ తర్వాత వెంటనే కొలువు కావాలంటే.. ఈ 4.0 స్కిల్స్ ఉండాల్సిందే!
నైపుణ్యాలుంటేనే ఆఫర్స్..
బీటెక్ విద్యార్థులు జాబ్ మార్కెట్లో అడుగు పెట్టాలంటే.. డిజిటల్, లేటెస్ట్ స్కిల్స్ సొంతం చేసుకోవాల్సిందే. అకడమిక్‌గా అద్భుతంగా ఉన్నాం కదా.. ఉద్యోగం ఖాయం అనే పరిస్థితి లేదు. సంస్థలు ఏ బ్రాంచ్ విద్యార్థులైనా దానికి సంబందించి లేటెస్ట్ నైపుణ్యాలు ఉన్నాయా..అని పరిశీలించాకే ఆఫర్స్ ఇస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా లేటెస్ట్ స్కిల్స్ సొంతం చేసుకోవాలి.
చదవండి: Engineering Career: బీటెక్.. బెస్ట్‌గా నిలవాలంటే!