Skip to main content

Integrated Schools: మెతుకుసీమకు ఇంటిగ్రేటెడ్‌ ఏది?

మెదక్‌ జోన్‌: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులంతా ఒకే గొడుకు కింద చదువుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌’’ను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామని నిర్ణయించింది.
integrated schools in telangana

ఇందు కోసం 25 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించనుంది. ఇందులో భాగంగా 28 నియోజకవర్గాల్లో అక్టోబర్ 11న భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇందులో మెదక్‌ జిల్లాకు మాత్రం స్థానం దక్కలేదు. దీంతో జిల్లాలోని ఉన్నత విద్యావేత్తలు, విద్యార్థులు నిరాశకు లోనవుతున్నారు.

మెదక్‌ జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. విద్యలో రాష్ట్రంలోనే ఈ జిల్లా అత్యంత వెనుకబాటుకు గురైంది. అయితే కులరహిత గురుకుల పాఠశాలల నిర్మాణం కోసం ఇప్పటికే మెదక్‌ నియోజకవర్గంలో ఉన్న రామాయంపేటలో, నర్సాపూర్‌ నియోజకవర్గంలో జక్కుపల్లి గ్రామం వద్ద 25 ఎకరాలు చొప్పున 50 ఎకరాలను అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికను అందించారు. కానీ జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు ఈ యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మంజూరు కాలేదు.

చదవండి: Anudeep Durishetty: అనుదీప్‌.. హైదరాబాద్‌ కలెక్టర్‌.. కలెక్టర్‌గా పని చేసినవారిలో అత్యంత పిన్న వయస్కుడు.. స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

ఉన్నత విద్యకు దూరం

మెతుకుసీమలో పీజీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి ఉన్నత చదువులు చదువుకున్న వారు అతితక్కువే. కనీసం కాంగ్రెస్‌ పాలనలోనైనా ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందంటూ ఆశగా చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు మంజూరు కాగా భవన నిర్మాణాలకు సీఎం, మంత్రులతో పాటు ఇతర నాయకులు అక్టోబర్ 11న రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో శంకుస్థాపన చేశారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అవి జిల్లాకు మంజూరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులంతా ఒకే చోట 4 నుంచి ఇంటర్‌ వరకు 2,500 మంది చదువుకునేందుకు వీలుంటుంది. అలాగే అన్ని విభాగాల వారు, విద్యార్థులు అంతా కలిసి ఒకేసారి కూర్చొని భోజనం చేసేందుకు డైనింగ్‌ హాల్‌తోపాటు సకల సౌకర్యాలతో నిర్మాణాలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా పలు రకాల క్రీడల కోసం మైదానాలను ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విద్యలో అత్యంత వెనుకబాటుకు గురైనా మెదక్‌ జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాలు ఉండగా ఒక్క నియోజకవర్గానికై నా మంజూరు కాకపోవటంతో ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు. ఇప్పటికై నా ఇక్కడి పాలకులు స్పందించి కనీసం ఒక్కటైనా కులరహిత గురుకులాన్ని మంజూరు చేయించాలని కోరుతున్నారు.

Published date : 28 Oct 2024 03:18PM

Photo Stories