Scholarships: ‘విదేశీ విద్యానిధి’కిదరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
నారాయణపేట: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు అంబేడ్కర్ విదేశీ విద్యానిధికి అక్టోబర్ 29 వరకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కజ్జం ఉమాపతి అక్టోబర్ 16న ఒక ప్రకటనలో తెలిపారు.
మెడిసిన్, ఇంజినీరింగ్, ఫార్మసి, నర్సింగ్, సైన్‌న్స్, హుమానటీస్ తదితర కోర్సులు పూర్తి చేసినవారు పైచదువులు విదేశాలలో చదువుకోరే విద్యార్థినీ–విద్యార్థులు దరఖాస్తులు నేరుగా epass వైబ్సెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
చదవండి: Scholarships: విదేశీ విద్యానిధికి మరింత ప్రోత్సాహం!.. ఏటా కేవలం ఇంత మందికే అందుతున్న ఆర్థిక సాయం
దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం రూ.5లక్షలకు మించకూడదని, వయస్సు 35సం.లోపు ఉండాలని తెలిపారు. ఈ పథకం కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని, డిగ్రీ పరీక్షలో 60 శాతం మార్కులు, గుర్తింపు పొందిన విదేశీ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొంది ఉండాలని, GQE,GMAT,TOFEL,IELT నందు 60 శాతం మార్కులు కలిగిన వారు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
Published date : 17 Oct 2024 04:17PM