CMs Overseas Scholarship: విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తులు
సెప్టెంబర్ 15 నుంచి అక్టోబరు 15 వరకు www.telangana. epass. gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇంజనీరింగ్, వైద్యం, సైన్స్, మేనేజిమెంట్, వ్యవసాయం, నర్సింగ్, సామాజిక శాస్త్రాల్లో డిగ్రీలో 60 శాతం మార్కులు, వయస్సు 35 సంవత్సరాలలోపు, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు, విదేశి వర్సిటీల నుంచి ఐ20, వీసా పొందిన అభ్యర్థులై ఉండాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య
నాంపల్లి : ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఆర్.దస్రూనాయక్ అన్నారు. సెప్టెంబర్ 20న నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు.
తరగతి గదుల నిర్వహణ, విద్యార్థులు, అధ్యాపకుల హాజరు పట్టికలు, విద్యార్థుల నమోదును పరిశీలించారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి, తమ భవిష్యత్ లక్ష్యాలతో ముందుకు సాగాలన్నారు. అనంతరం ఆయనను అధ్యాపకులు శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ముత్యం వెంకన్న, అధ్యాపకులు రజినీకాంత్, శ్రీనివాస్, ముత్యాలు, సైదయ్య, సృజన్‌కుమార్, సురేష్, ప్రసన్నలక్ష్మి, శైలజ, సమత తదితరులు పాల్గొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here ▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
కౌమార విద్యపై ఉపాధ్యాయులకు శిక్షణ
నల్లగొండ : జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20న కౌమరవిద్యపై ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులకు పోస్టర్ మేళా నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఈఓ భిక్షపతి మాట్లాడుతూ కౌమార దశలో బాలబాలికలలో కలిగే శారీరక, మానసిక మార్పులపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.
పోస్టర్ మేళాలో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులు, పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎయిడ్స్ నియంత్రణ విభాగం అధికారి వి.సుధాకర్, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ ఆర్.రామచంద్రయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.