Skip to main content

Overseas Scholarship: విదేశీ విద్యకు ప్రోత్సాహం.. అర్హతలు, కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు ఇవే..

మంచిర్యాలటౌన్‌: విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతికి చెందిన ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విదేశి విద్యానిధి పథకం ద్వారా చేయూత అందిస్తోంది.
Encouragement of foreign education news in telugu  Government support for SC students studying abroad with Rs. 20 lakh assistance Financial aid for poor and middle-class SC students for higher studies abroad Ambedkar Overseas Education Fund providing loans for SC students

ఏదేని డిగ్రీ పూర్తి చేసి ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లాలని ఆసక్తి ఉన్నవారికి అందుకు అవసరమయ్యేందుకు గానూ విడతకు రూ.10 లక్షల చొప్పున రెండు విడతల్లో రూ.20లు అందిస్తుంది. నిరుపేద, మధ్యతరగతికి చెందిన ఎస్సీ విద్యార్థులకు అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పేరిట రుణాలు అందిస్తున్నారు.

2014–15లో ఎస్సీ, ఎస్టీలకు ఈ పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తుండగా అవగాహన లేకపోవడంతో పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఏటా సెప్టెంబర్‌, జనవరి మాసాల్లో అవకాశం కల్పిస్తున్నా ఇప్పటికీ మంచిర్యాల జిల్లా నుంచి విదేశాలకు వెళ్లిన విద్యార్థులు 20లోపే ఉన్నారు.

చదవండి: Overseas Vidya Nidhi scholarship: విదేశీ విద్యకు రూ. 20 లక్షల ఉపకారవేతనం.. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

అవగాహన కల్పిస్తేనే..

విదేశీ విద్యకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూత అందించేందుకు ఏటా రుణాలు అందిస్తున్నా పథకంపై విద్యార్థులు, తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కువమంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఎస్సీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వారి అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం పథకం ద్వారా లబ్ధి పొందినవారు 19 మంది మాత్రమే ఉన్నారు.

చదవండి: Study Abroad: విదేశాలకు వెళ్లాలా? వద్దా? అయోమయంలో విద్యార్థులు

ప్రస్తుతం ఈ ఏడాది అక్టోబర్‌ 13వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయించాల్సి ఉంది. ఎంపిక ప్రక్రియ, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ వివరాలన్నీ రాష్ట్రస్థాయిలోనే ఉంటున్నందువల్ల ఈ పథకం ద్వారా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? ఎవరెవరు లబ్ధి పొందారనే వివరాలు వెంటనే జిల్లా అధికారులకు తెలియడం లేదు. ఈ పథకం ద్వారా ఏటా అవకాశం కల్పిస్తున్నా క్షేత్రస్థాయిలో విద్యార్థుల దరిచేరడంలేదు.

అర్హతలు, కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు

అంబేద్కర్‌ విదేశి విద్యానిధి పథకం కోసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు 2024 జూలై 1 నాటికి గరిష్ట వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి. ఇంగ్లిష్‌ ప్రొఫిషియెన్సీ టెస్టులో ప్రతిభ ఉన్న విద్యార్థులకు అవకాశం ఉండగా ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంది.

ఇంజినీరింగ్‌ సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, వ్యవసాయం, నర్సింగ్‌, సామాజికశాస్త్రం కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. టోఫెల్‌లో 60 శాతం, ఐఈఎల్‌టీఎస్‌లో 8.0 శాతం మార్కులు, జీఆర్‌ఈ, జీమ్యాట్‌లో 50 శాతం అర్హత మార్కులు పొందాలి. పీజీ, పీహెచ్‌డి చేసే విద్యార్థులు డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించాలి.

విద్యార్థుల కులం, ఆదాయం, జనన ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్‌కార్డు, పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, పీజీ మార్కుల మెమోలు, టోఫెల్‌, ఐఈఎల్‌, టీఎస్‌జీఆర్‌ఈ, జీమ్యాట్‌ అర్హత, విదేశాల్లో విధ్యాభ్యాసం చేసేందుకు సంబంధిత కళాశాల నుంచి పంపిన ప్రవేశ అనుమతి పత్రం, కళాశాల ప్రవేశ రుసుం చెల్లించిన రశీదు, బ్యాంకు ఖాతా పుస్తకాలు ఉండాలి.

సంబంధిత ధృవపత్రాల ఆధారంగా ఆన్‌లైన్‌లో తెలంగాణ ఈ–పాస్‌ వెబ్‌సైట్‌ https://telangana.epass.cgg.gov.in లో అక్టోబర్‌ 13 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

దరఖాస్తు చేసుకోవాలి

విదేశాల్లో విద్యను అభ్యసించాలనే ఆసక్తి ఉండి అర్హులైన విద్యార్థులకు విదేశీ విద్యానిధి పథకం ద్వారా ప్రభుత్వం రూ.20 లక్షల రుణం అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విదేశాల్లో చదవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– రవీందర్‌రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి, మంచిర్యాల

Published date : 18 Sep 2024 01:09PM

Photo Stories