Skip to main content

Scholarships: రెండేళ్లుగా స్కాలర్‌షిప్‌లు కోసం ఎదురుచూపులు

నల్లగొండ: షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులకు రెండేళ్లుగా ప్రభుత్వం ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్‌లు) మంజూరు చేస్తున్నా సగం మందికే అందుతున్నాయి.
Waiting for scholarships for two years

జిల్లా ట్రెజరీ కార్యాలయం(డీటీఓ)లో బిల్లులు సకాలంలో పాస్‌ కాకపోవడంతో స్కాలర్‌షిప్‌ల చెల్లింపులు ఆగిపోతున్నాయి. దీంతో మిగతా సగం మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందలేదు. ఫలితంగా కొందరు విద్యార్థులకు రెండేళ్లుగా మరికొందరికి ఏడాదిగా ఎదురుచూపులు తప్పడం లేదు.

జిల్లాలో 250 కళాశాలలు

నల్లగొండ జిల్లాలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ, నర్సింగ్‌, ఇంజనీరింగ్‌, మెడికల్‌తో కలిపి మొత్తం 250 కళాశాలలు ఉన్నాయి. ఇందులో వివిధ కోర్సులు చేసే విద్యార్థులు దాదాపు 10 వేల మంది వరకు ఉన్నారు. అయితే షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖ వీరికి మెస్‌ చార్జీల కింద ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు సంవత్సరానికి రూ.5 వేలు, బీటెక్‌, పీజీ విద్యార్థులకు రూ.6,500, నర్సింగ్‌ విద్యార్థులకు రూ.15 వేలు ఇస్తూ వస్తోంది.

చదవండి: CMs Overseas Scholarship: విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తులు

బిల్లులు పాసైంది సగమే..

2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు రూ.20 కోట్లు, అలాగే 2023–24 సంవత్సరానికి రూ.18 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. వాటికి సంబంధించి విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లు పొందేందుకు విద్యాసంస్థలు బిల్లులు సమర్పించగా డీటీఓలో మాత్రం రూ.20 కోట్ల బిల్లులు మాత్రమే పాసయ్యాయి.

అంటే దాదాపు ఒక సంవత్సరం స్కాలర్‌షిప్‌లే మంజూరయ్యాయి. 2023లో ఉన్న విద్యార్థులకు దాదాపు 70 శాతం మందికే స్కాలర్‌షిప్‌లు అందాయి. మిగిలిన 30 శాతం మందికి అందలేదు. ఇక, 2023–24లో మాత్రం 30 శాతం మంది వరకు అందాయి. మిగతా 70 శాతం మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం నిరీక్షిస్తున్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఇబ్బందుల్లో విద్యార్థులు

స్కాలర్‌షిప్‌లు రాకపోవడంతో తాము చదువుతున్న కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఎస్సీ విద్యార్థులకు వాపోతున్నారు.

మరోపక్క హాస్టళ్లలో ఉంటూ ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారికీ మెస్‌చార్జీలు రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి డీటీఓలో ఉన్న పెండింగ్‌ బిల్లులను పాస్‌చేసి విద్యార్థులందరికీ చెల్లింపులు చేయాలని కోరుతున్నారు.

  • రెండేళ్లుగా సగం బిల్లులే పాస్‌
  • మిగతా సగం డీటీఓలో పెండింగ్‌
  • ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు
  • స్కాలర్‌షిప్‌ల కోసం 10 వేల మంది ఎస్సీ విద్యార్థుల ఎదురుచూపు
Published date : 23 Sep 2024 04:24PM

Photo Stories