ITI Jobs: ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..

తిరుపతి అర్బన్‌: ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నా యని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్‌.లోకనాథం తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన యువకులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇంటర్వ్యూలు నిర్వహించన్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈనెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు సూళ్లూరుపేట – శ్రీకాళహస్తి రోడ్‌ మార్గంలోని సీసీఎల్‌ ప్రొడక్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, కాంటినెంటల్‌ కాఫీ పార్క్‌, కువ్వకోలి వద్ద ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎంపికై న వారికి అదే కంపెనీ ద్వారా రాయితీతో వసతి సదుపాయం ఉంటుందని వివరించారు. రిజిస్ట్రేషన్‌ లింకును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అదనపు సమాచారం కోసం 9966601867 సంప్రదించాలని కోరారు.

చదవండి: Free training: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. ఎక్క‌డంటే?

#Tags