Free training: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. ఎక్కడంటే?
ఏఆర్‌టీపీ సిల్క్ కళాశాలలో రీటైల్ సేల్స్ సూపర్‌వైజర్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు డీఆర్‌డీఏ–సీడాప్ సంచాలకులు నరసింహారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండి 18 నుంచి 26 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వారు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. తప్పనిసరిగా ఇంటర్ ఉత్తీర్ణులై.. చదువు కొనసాగిస్తూ ఉండకూడదని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డ్, ఉపాధిహామీ కార్డుతో అనంతపురములోని పంగల్ రోడ్డు వద్ద ఉన్న టీటీడీసీ శిక్షణ కేంద్రంలో సంప్రదించాలన్నారు. ఈనెల 15 నుంచి 18 వరకూ ఎంపికలు జరుగుతాయన్నారు. ఎంపికై న అభ్యర్థులకు 4 నెలల పాటు భోజన సదుపాయంతో కూడిన ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 86394 39804, 96408 99337, 80744 52233 నంబర్లకు సంప్రదించాలన్నారు.
Tags
- Free training
- Free training for the unemployed
- unemployed
- unemployed rural youth
- employment opportunities
- ARTP Silk College
- Retail Sales Supervisor
- Computer
- spoken english
- Education News
- andhra pradesh news
- DRDA-CDAP
- employment opportunities
- Unemployed Youth
- employment opportunities for the youth
- latest jobs in 2024
- SakshiEducation job notifications