Skip to main content

Backlog Jobs: జెడ్పీలో కారుణ్య, బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో కారుణ్య నియామకాలతోపాటు బ్యాక్‌లాగ్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థులకు సోమవారం జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా నియామక ఉత్తర్వులు అందజేశారు.
Compassionate and backlog appointments distribution ceremony    backlog jobs in guntur district   Officials distributing appointment letters to candidates

వికలాంగులకు రిజర్వ్‌ కేటాయించబడిన బ్యాగ్‌లాగ్‌ ఖాళీలను జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో నిర్వహించిన స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో ఆఫీసు సబార్డినేట్‌ పోస్టుకు ఎంపికై , జెడ్పీకి కేటాయించిన కొప్పురావూరి లక్ష్మయ్యను మేడికొండూరు ఎంపీడీవో కార్యాలయం, బుస్సా సరితను వేమూరు మండలం పెరవలి జెడ్పీ హైస్కూల్లో నియమించారు. రెంటచింతల మండలం మల్లవరం ఎంపీపీ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తూ మృతి చెందిన ముక్కాల రామసుబ్బయ్య కుటుంబ జీవనాధారం కోసం అతని కుమారుడైన ముక్కాల ఆదర్ష్‌కు సామాజిక భద్రత ప్రాతిపదికన కారుణ్య నియామకంపై జెడ్పీలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా నియమించారు.

చదవండి: Job interviews: నేడు, రేపు వర్సిటీలో ఉద్యోగ ఇంటర్వ్యూలు

Published date : 20 Feb 2024 03:40PM

Photo Stories