Skip to main content

Job interviews: నేడు, రేపు వర్సిటీలో ఉద్యోగ ఇంటర్వ్యూలు

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో మంగళ, బుధవారాల్లో హైదరాబాద్‌కు చెందిన కేఎంఈ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్య తెలిపారు.
Job interviews at university   Job interview schedule announcement   Job interview session

రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోమవారం వివరాలు వెల్లడించారు. అన్ని అఫిలియేషన్‌ కళాశాల నుంచి డిగ్రీ చివరి ఏడాది, డిగ్రీ పూర్తి చేసుకున్న 365 మంది విద్యార్థులు వర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మంగళవారం బీఏ, బీకాం, బీబీఎం, బీబీఏ డిగ్రీ అర్హత వారికి, బుధవారం బీఎస్సీ వారికి ఇంటర్వ్యూలు ఉంటాయని చెప్పారు. ఎంపికై న వారు కంపెనీ నిబంధనల మేరకు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏడాదికి రూ. 2.04 లక్షలు ప్యాకేజీ, ఏడాది తర్వాత రూ.3.03 లక్షలు ప్యాకేజీ ఉంటుందని అన్నారు. స్క్రీనింగ్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక నిర్వహించనున్నట్లు తెలిపారు. వెబ్‌ సైట్‌లో నమోదు చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటల్లోపు చేరుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రిజిస్ట్రార్‌ వెంట ప్లేస్‌మెంట్‌ అధికారి విద్యాసాగర్‌ ఉన్నారు.

చదవండి: Indian Railway Jobs: 5,696 పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్...

Published date : 20 Feb 2024 01:37PM

Photo Stories