Skip to main content

Walk-in interviews: కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు.. ఎక్కడంటే..

interview date   Walk-in Interviews for Contract Assistant Professor Posts   25 Contract Assistant Professor Posts

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో 25 కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఈ నెల 21న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెస ర్‌ పి.సుజాత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 16 విభాగాలకు సంబంధించి నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. నేరుగా విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాల్సి ఉంటుందని అన్నారు. పూర్తి సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. బీఆర్‌ఏయూ.ఈడీయు.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో పొందు పర్చినట్లు చెప్పారు. ఎకనామిక్స్‌లో ఒకటి, ఎడ్యుకేషన్‌ మెంటల్లీ రిటార్డ్‌లో ఒకటి, జర్నలిజం మాస్‌కమ్యూనికేషన్‌లో రెండు, లైబ్రరీ ఇన్‌ఫర్మేషన్‌ సైన్స్‌లో ఒకటి, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో ఒకటి, యోగా ఫిట్‌ నెస్‌ మేనేజ్‌మెంట్‌లో రెండు, ఫిజిక్స్‌లో నాలుగు, సివిల్‌ ఇంజినీరింగ్‌లో రెండు, కంప్యూటర్‌ సైన్స్‌లో రెండు, ట్రిపుల్‌ఈలో ఒకటి, సీఎస్‌ఈలో ఒకటి, మెకానికల్‌లో ఒకటి భర్తీ చేయనున్నట్లు చెప్పారు.

Published date : 18 Mar 2024 12:31PM

Photo Stories