Tenth Exams: విద్యార్థులకు పదవ తరగతి ఎంతో ముఖ్యమైన దశ..

పాఠశాలను తనిఖీ చేసేందుకు వచ్చిన జెడ్పీ చైర్‌ పర్సన్‌ పాఠశాలను, విద్యార్థులను, అక్కడి సదుపాయాలను పరిశీలించారు. అలాగే, విద్యార్థులకు త్వరలో జరిగే బోర్డు పరీక్షల గురించి ఇలా మాట్లాడారు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉంటూ ప్రణాళికబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌ పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు.మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–2ను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందజేస్తున్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం 9, 10 తరగతి విద్యార్థులకు పలు సబ్జెక్టులలో ప్రశ్నలు వేసి, విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు.

Intermediate Practicals:ఇంటర్‌ విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి..

ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో పదో తరగతి ఎంతో ముఖ్యమైన దశ, విద్యార్థులు పదిలో ఉత్తమ ఫలితాలు సాధించి భవిష్యత్తును ఉత్తమంగా మలుచుకోవాలన్నారు. విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షలు అంటే భయాన్ని వీడాలని, ప్రశాతంగా పరీక్షలు రాయలని సూచించారు. ప్రతి సబ్జెక్టులో పట్టు సాధించాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో కిరణ్‌కుమార్‌, హెచ్‌ఎంలు ప్రకాశ్‌, రాధాకృష్ణ, వార్డెన్‌ రత్నకుమారి, ఉపాధ్యాయులున్నారు.

#Tags