Skip to main content

Intermediate Practicals:ఇంటర్‌ విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి..

ఈనెల 11 నుంచి ఇంటర్‌ ద్వితియ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జరిగే ప్రాక్టికల్స్‌ కోసం వారి కళాశాలల్లోనే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షను నిర్వహించే విధానంపై స్పష్టతను ఇచ్చారు..
Lab instructor monitoring Inter second-year practical exams   College practical examsArrangements for intermediate science students practical exams   Lab equipment setup for Inter second-year practical exams

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా ద్వితీయ సంవత్సర సైన్స్‌ విద్యార్థులకు ఈనెల 11 నుంచి జరగనున్న ప్రాక్టికల్స్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాన్‌ జంబ్లింగ్‌ విధానంలో ఏ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అదే కళాశాలలో జరగనున్న ప్రాక్టికల్స్‌కు జిల్లావ్యాప్తంగా 113 కేంద్రాల్ని సిద్ధం చేశారు. ఎంపీసీ విభాగం నుంచి 21,817 మంది, బైపీసీ విభాగం నుంచి 3,093 మంది చొప్పున మొత్తం 24,910 మంది హాజరుకానున్నారు.

NIT Warangal: నిట్‌తో హార్ట్‌ఫుల్‌నెస్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ఎంఓయూ

గతేడాది వరకు ఓఎంఆర్‌, బార్‌ కోడింగ్‌ పద్ధతిలో మాన్యువల్‌గా చేసిన మార్కుల నమోదు విధానాన్ని బోర్డు ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానంలోకి మార్చింది. రోజుకు రెండు విడతలుగా ప్రాక్టికల్స్‌ జరుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం విడతలుగా వారీగా ప్రాక్టికల్స్‌ ముగిసిన వెంటనే పేపర్లను కరెక్షన్‌ చేసి, విద్యార్థుల మార్కుల్ని అక్కడిక్కడే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆర్‌ఐవో జీకే జుబేర్‌ ఆదేశించారు. దీనిపై ఇప్పటికే అధ్యాపకులకు ఓరియెంటేషన్‌ కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.

Published date : 10 Feb 2024 03:39PM

Photo Stories