End of Inter Exams: ఇంటర్ ద్వితియ సంవత్సర పరీక్షలు ముగిసాయి
యలమంచిలి రూరల్: ఎగ్జామ్ ఎలా రాశావ్.. నేను బాగానే రాశాను..మరి నువ్వు ఎలా రాసావ్..? అంటూ పరీక్ష నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు.. వారు రాసిన ప్రశ్నలు, జవాబులను సరిచూసుకున్నారు. శుక్రవారం ఇంటర్ ద్వితియ సంవత్సర విద్యార్థులు వారి అఖరి పరీక్షను రాసి బయటకు వచ్చారు. పరీక్షలు మొదలైన దగ్గర నుంచి పుస్తకాలతో కుస్తీ పడుతూ చదువు పోరాటం చేస్తున్న విద్యార్థులు, శుక్రవారం ముగియడంతో అవధులు లేని ఆనందంతో ఇంటి ముఖం పట్టారు.
Training and Employment: నాక్ శిక్షణ కేంద్రంలో ప్లంబింగ్ కోర్సులు
యలమంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొక్కిరాపల్లి అంబేడ్కర్ బాలికల కళాశాలల కేంద్రాల వద్ద పరీక్షలు రాసిన విద్యార్థులు ఒకరికొకరు బైబైలు చెప్పుకుంటూ సెలవుల్లో ఆనందంగా గడపాలని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బీసీ వసతి గృహాలు, రెసిడెన్షియల్ కళాశాలల నుంచి తమ పిల్లల్ని తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. విద్యార్థులంతా తమ సహచర విద్యార్థులను ఒకరినొకరు పలకరించుకుంటూ ముందుకు సాగారు. చివరిరోజు శుక్రవారం ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి.