Skip to main content

AP Inter Academic Calendar 2024-25: ఏపీ ఇంట‌ర్ అకాడమిక్ క్యాలెండర్ 2024-25 ఇదే.. ఈ సారి భారీగా సెల‌వులు ఇలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఇంట‌ర్ విద్యా సంవ‌త్స‌రం 2024 జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రంలో ఇంట‌ర్ విద్యార్థుల‌కు భారీగా సెల‌వులు రానున్నాయి.
AP Inter Academic Calendar 2024-25 Details

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్‌ విడుదల చేసింది. 2024 జూన్ 1 ఇంటర్మీడియట్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ 2024-25 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇంట‌ర్‌ విద్యా సంవత్సరం 2024 జూన్ 1వ తేదీ ప్రారంభమై.. 2025 మార్చి 31వ‌ ముగియనుంది.

ఏపీ ఇంట‌ర్ 2024-25 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..
☛ 2024 సెప్టెంబర్ 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు క్వార్టర్లీ పరీక్షలు జరగనున్నాయి.
☛ డిసెంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు హఫ్ ఇయర్లీ పరీక్షలు జరగనున్నాయి.
☛ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి.
☛ ఫిబ్రవరి రెండో వారంలో ఇంట‌ర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
☛ ఇంట‌ర్ పబ్లిక్ పరీక్షలు మార్చి మొదటి వారంలో నిర్వహించనున్నారు.

ఏపీ ఇంట‌ర్ 2024-25 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెల‌వులు తేదీలు ఇవే..
➤ అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.
➤ జనవరి 12 నుంచి జనవరి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు.
➤ అలాగే ఇంట‌ర్ విద్యార్థుల‌కు వివిధ పండ‌గ సెల‌వులు తేదీల‌ను బ‌ట్టి ఇవ్వ‌నున్నారు. అలాగే 2025 వేస‌వి సెల‌వులు మాత్రం మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంది.

తెలంగాణ‌ ఇంట‌ర్ అకాడమిక్ క్యాలెండర్ 2024-25 ఇదే.. 

ts inter students

తెలంగాణ ఇంటర్మీడియట్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఇటీవ‌లే ముగిసిన విష‌యం తెల్సిందే. ఇప్పుడు తాజాగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంట‌ర్ అకడమిక్ యాన్యువల్ క్యాలెండర్‌ను మార్చి 30వ తేదీన‌ విడుదల చేసింది. ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇంట‌ర్‌ విద్యా సంవత్సరం 2024 జూన్ 1వ తేదీ ప్రారంభమై.. 2025 మార్చి 29వ‌ ముగియనుంది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం పని దినాలు 227గా ఉండనున్నాయని ప్రకటించారు. అలాగే వ‌చ్చే ఏడాది కూడా కాలేజీల‌కు సెల‌వులు భారీగానే ఉన్నాయి.

ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..
ఇంట‌ర్ అర్ధవార్షిక పరీక్షలు నవంబర్ 18 నుంచి 23 వరకు నిర్వ‌హించ‌నున్నారు. అలాగే ఇంట‌ర్‌ ప్రీ ఫైనల్ పరీక్షలు 2025 జనవరి 20 నుంచి 25 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఇంట‌ర్‌ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వ‌హించ‌నున్నారు. ఇంట‌ర్‌ పబ్లిక్ పరీక్షలు మాత్రం మార్చి మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. ఇంట‌ర్ విద్యార్థుల‌కు దసరా సెలవులు అక్టోబర్ 6 నుంచి 13 వరకు ఉండనున్నాయి. అలాగే సంక్రాంతి సెలవులు 2024 జనవరి 11 నుంచి 16 వరకు ఉండనున్నాయి. అలాగే వివిధ పండ‌గ సెల‌వులు తేదీల‌ను బ‌ట్టి ఇవ్వ‌నున్నారు. అలాగే 2025 వేస‌వి సెల‌వులు మాత్రం మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

ఇంట‌ర్ అకడమిక్ కేలండర్ 2024-25కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 17 Apr 2024 03:52PM
PDF

Photo Stories