Skip to main content

ZP School : ఒంటిగంటకే ఫైన‌ల్ బెల్ మోగే పాఠ‌శాల‌పై ఉన్న‌తాధికారుల దృష్టి.. ఇక‌పై!

మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా హైస్కూల్‌ తరగతులను రెండుపూటలా నిర్వహించారు.
Senior officials attention on zilla parishad school

రాజంపేట: నందలూరు జిల్లా పరిషత్‌ పాఠశాల పరిస్థితిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా హైస్కూల్‌ తరగతులను రెండుపూటలా నిర్వహించారు. ‘ఒంటిగంటకే ఫైనల్‌ బెల్‌’ శీర్షికన ‘సాక్షి’లో ఈనెల 26న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శతాబ్దిన్నర కాలం నాటి ఈ పాఠశాల ఐఏఎస్‌ల పాఠశాలగా గుర్తింపు పొందింది.

Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. ఎన్నికలు ఎప్పుడంటే..?

కానీ, మూడు దశాబ్దాలుగా షిప్ట్‌ విధానంతో హైస్కూలు విద్య పడిపోయింది. అదే క్యాంపస్‌లో ఇంటర్‌ కళాశాల కొనసాగింపు వల్ల హైస్కూలు, ఇటు ఇంటర్‌ విద్యాబోధనలు, ప్రగతి పడిపోతున్న క్రమంలో ప్రచురితమైన సాక్షి కథనం రాష్ట్రస్ధాయి ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి వెళ్లాయి.

రెండుపూటలా హైస్కూల్‌ తరగతులు

‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో ముప్పయేళ్ల తర్వాత బుధవారం షిప్ట్‌ లేకుండా తరగతులు నిర్వహించడం విశేషం. కానీ.. గదులు లేక చెట్ల కింద తరగతులు నిర్వహించుకోవాల్సి వచ్చింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఇంటర్‌బోర్డు కమిషనరుతో మేడా చర్చలు

నందలూరు హైస్కూల్‌ క్యాంపస్‌లో ఇంటర్‌ కళాశాల కొనసాగించడం వల్ల దశాబ్దాల పాటు కొనసాగిన షిప్ట్‌ విధానానికి ఇప్పటికైనా స్వస్తి పలకాలని ఇంటర్‌మీడియట్‌ బోర్డు కమిషనరు కృతికాశుక్లాతో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్‌ రెడ్డి ఫోన్‌ ద్వారా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో హైస్కూల్‌ క్యాంపస్‌లో ఇంటర్‌ కళాశాల కొనసాగింపుపై కొనసాగుతున్న అంశంపై ఆమెతో మాట్లాడారు.

Food Safety in Schools: ఇక ఫొటోలు తీసి.. వీరు తిన్నాకే.. పిల్లలకు వడ్డించాలి!

షిప్ట్‌ విధానం నుంచి హైస్కూలు, ఇంటర్‌కు విముక్తి కల్పించడం వల్ల విద్యాప్రగతికి బాటలు వేసినమవుతామని వివరించారు. ఈ విషయమై కమిషనరు సానుకూలంగా స్పందించారని రాజ్యసభసభ్యుడు మేడా రఘునాథ్‌ రెడ్డి ధృవీకరించారు. ఇంటర్‌కళాశాలకు సొంతభవనం నిర్మాణం విషయంలో అన్ని విధాలుగా తన సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 29 Nov 2024 03:05PM

Photo Stories