NIT Warangal: నిట్‌తో హార్ట్‌ఫుల్‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఎంఓయూ
Sakshi Education
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో హైదరాబాద్‌కు చెందిన హార్ట్‌ఫుల్‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఫిబ్రవరి 9న పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి.
నిట్ వరంగల్ విద్యార్థులకు సెంటర్‌ఫర్‌మెంట్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ సౌజన్యంతో ధ్యాన్ మహోత్సవం పేరిట వర్క్‌షాప్ నిర్వహించేందుకు ఒప్పందం తోడ్పడుతుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు.
చదవండి: Microsoft: మైక్రోసాఫ్ట్‌లో 75 వేల మహిళా డెవలపర్లకు నైపుణ్య శిక్షణ
నిట్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేష న్‌పై వర్క్‌షాప్ నిర్వహించి విద్యార్థులకు ధ్యానం, ఆరోగ్య జీవనశైలిపై అవగాహన కల్పించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, హార్ట్‌ఫుల్‌నెస్ ఎడ్యుకేష న్ ట్రస్ట్ ప్రతినిధులు రిటైర్డ్ డీజీపీ ఆదిత్య ఆర్య, డాక్టర్ అనంత మాధవమోహన్, వరప్రసాదరావు పరస్పరం ఒప్పంద పత్రాలు అందజేసుకున్నారు.
Published date : 10 Feb 2024 01:32PM