D Pharmacy : డీ ఫార్మ‌సీతో ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు..

డీ ఫార్మ‌సీ నుంచి ఉన్న విద్యావ‌కాశాలు, ఉపాధి అవకాశాల గురించి ఇది వివ‌ర‌ణ‌..

తిరుపతి: విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు డిప్లొమా ఇన్‌ ఫార్మసీ (డీ ఫార్మసీ) కోర్సు దోహదపడుతోంది. రెండేళ్ల కాల పరిమితి గల ఈ కోర్సును అభ్యసించడం ద్వారా విద్యార్థులకు అధికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఫార్మసీ రంగంలో స్థిరపడేందుకు ఇది ఉత్తమమైన కోర్సు అని నిపుణులు పేర్కొంటున్నారు. ఔషధ రంగంలో వృత్తి నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు దోహదపడుతుంది.

ఉద్దేశం ఇదీ..

ఔషధ తయారీ, వాటిని పరీక్షించడం, మెడికల్‌ స్టోర్స్‌ నిర్వహణ, ఔషధాలను ఎలా పంపిణీ చేయాలి అనే విషయాలపై సమగ్ర అవగాహనే ఈ కోర్సు ఉద్ధేశం. రెండేళ్లపాటు విద్యార్థులకు ఈ అంశాల్లో శిక్షణ ఇస్తారు.

AP Inter Supplementary Results : ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రం సప్లిమెంట‌రీ ఫ‌లితాల్లో టాప్‌లో నిలిచిన జిల్లా ఇదే..

ఉద్యోగావకాశాలు..

కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఈఎస్‌ఐ, రైల్వే ఆస్పత్రులు, ప్రైవేటు హాస్పిటల్స్‌, మెడికల్‌ షాపులు, ఫార్మా కంపెనీల్లో ఫార్మాసిస్టులుగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. అలాగే సొంతంగా మెడికల్‌ షాపులు నిర్వహించుకోవచ్చు. అలాగే బీఫార్మసీ కోర్సులో చేరవచ్చు.

అర్హతలు ఇవీ..

డీ ఫార్మసీ కోర్సులో చేరేందుకు ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ చేసిన రెగ్యులర్‌ విద్యార్థులతో పాటు ఓపెన్‌ స్కూల్స్‌ ద్వారా ఎంపీసీ, బైపీసీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవడం ద్వారా అడ్మిషన్‌ పొందవచ్చు.

Youth Employment : భ‌విష్య‌త్తులో యువ‌త వ‌రంగా క‌న్న శాపంగా మార‌నుందా..?

చక్కటి అవకాశాలు

విద్యార్థులు తక్కువ సమయం, ఖర్చుతో జీవితంలో త్వరగా స్థిరపడేందుకు డీ ఫార్మసీ కోర్సు చాలా ఉత్తమం. తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 1964లో ప్రారంభించిన ఈ కోర్సు ద్వారా ఇప్పటి వరకు దాదాపు 60వేల మంది విద్యార్థులను ఫార్మాసిస్టులుగా అవకాశం పొందారు. వీరిలో చాలా మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రాణిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు పూర్తి వివరాలకు 99667 61446, 99088 57585 నంబర్లలో సంప్రదించవచ్చు.

– కృష్ణమూర్తి నాయుడు, హెచ్‌ఓడి, ఫార్మసీ విభాగం, ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌, తిరుపతి

Free TGPSC Group 2 Grand Tests: గ్రూప్‌–2 అభ్యర్థులకు ఉచిత గ్రాండ్‌ టెస్ట్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానం

#Tags